
సిమీ, పీఎఫ్‌ఐలకు నిజామాబాద్ అడ్డా
● కాంగ్రెస్ హయాంలో
లా అండ్ ఆర్డర్ బాగాలేదు
● ఎంపీ అర్వింద్ ధర్మపురి
ఖలీల్‌వాడి: సిమీ, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలకు నిజామాబా ద్ అడ్డాగా మారిందని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఐజీ కార్యాలయంలో శనివారం సీపీ పోతరాజు సాయిచైతన్యతో ఎంపీ సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీ డియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో లా అండ్ ఆర్డర్ బాగాలేదన్నారు. వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశా రని తెలిపారు. యువకుడిపై కేసు నమోదు చే సిన సందర్భంగా ఓ వర్గానికి చెందిన సుమారు 400 మంది బైక్ ర్యాలీ నిర్వహించి, హారన్ కొట్టుడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే మాత్రం కేసు నమోదు చేయలేదన్నారు. తాను పోలీసులతో మాట్లాడిన తర్వాత బాధ్యు లపై కేసులు నమోదు చేశారన్నారు. హిందువుల పండుగలకు ఆంక్షలు ఎక్కువయ్యాయని, తప్పు చేసిన వారి విషయంలో మత ప్రస్తావన ఎందుకు తీసుకువస్తున్నారని ప్రశ్నించారు. ఇటీవల దొరికిన ఉగ్రవాదులను పోలీసులు విచారిస్తే స్వచ్ఛంద సంస్థల ముసుగులో లవ్‌జీహాదీలకు సపోర్టు చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. మర్వాడీ గో బ్యాక్ కాదని, ఇక్క డే ఉన్న బంగ్లాదేశ్, మయన్మార్, టర్కీ దేశాల వారిని వెళ్లగొట్టాలని సూచించారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు, ఉగ్ర కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని సీపీ సాయి చైతన్యను కోరినట్లు ఎంపీ అర్వింద్ తెలిపారు.