విద్యుత్‌ షాక్‌తో మూడు గేదెలు.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ షాక్‌తో మూడు గేదెలు..

Sep 14 2025 2:22 AM | Updated on Sep 14 2025 2:22 AM

విద్య

విద్యుత్‌ షాక్‌తో మూడు గేదెలు..

లింగంపేట(ఎల్లారెడ్డి): మండలంలోని భవానిపేట గ్రామ శివారులో విద్యుత్‌ షాక్‌తో మూడు గేదెలు మృతి చెందినట్లు లైన్‌మెన్‌ పాండు తెలిపారు. గ్రామానికి చెందిన మాదిగ బాలయ్య పొలం వద్ద బోరు మోటారు సర్వీస్‌ వైరు తెగిపోయి ఫినిషింగ్‌ వైర్‌పై పడింది. ఈక్రమంలో శనివారం అదే గ్రామానికి చెందిన ఆకుల సురేందర్‌, గుండ్ర సత్యనారాయణ, గుండ్ర పరందాములుకు చెందిన గేదెలు గ్రామ శివారులోకి మేతకు వెళ్లాయి. దీంతో గేదెలు మేత మేసుకుంటూ వెళ్లగా ఫినిషింగ్‌ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. గేదెల విలువ సుమారు రూ. 3లక్షలు ఉంటుందన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

చికిత్సపొందుతూ వృద్ధురాలు..

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై భార్గవ్‌గౌడ్‌ తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన నట్ట అనసూయ(79) అనే వృద్ధురాలు గత నెల 28న కాలకృత్యాలు తీర్చుకునేందుకు ఇంటి బయటకు వెళ్లి కాలుజారి నేలపై పడిపోయింది. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబసభ్యులు గమనించి చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.అనంతరం మెరుగైన వైద్యం కోసం ఈ నెల 3న మె దక్‌లోని ఓ ప్రయివేట్‌ ఆస్పత్రికి, అక్కడి నుంచి ఈ నెల 8న హైదరాబాద్‌ లోని నిమ్స్‌కు తరలించి చికిత్స చేయించారు. కాగా ఈ నెల 12న ఆమె ఆ స్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి మనువడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యాయత్నం

వర్ని: చందూర్‌ మండలంలోని ఘన్‌పూర్‌ గ్రామంలో ఓ యువతి తన ప్రియుడు మోసం చేశాడని ఆత్మహత్యకు యత్నించింది. వర్ని మండలం కూనిపూర్‌ క్యాంపునకు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేశాడని ఘన్‌పూర్‌ గ్రామానికి చెందిన సదరు యువతి మనస్తాపం చెందింది. దీంతో శుక్రవారం ఆమె ప్రియుడి ఇంటి ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నం చేసింది. వెంటనే స్థానికులు బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్‌ తెలిపారు.

విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై కేసు

నవీపేట: పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తిరుపతి శనివారం తెలిపారు. మూడు రోజుల కిందట మండల కేంద్రానికి చెందిన ఒక వర్గానికి చెందిన యువకుడు ప్రార్థనా మందిరంపై జెండాను మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియలో షేర్‌ చేశాడు. ఇది వైరల్‌గా మారడంతో ఆగ్రహానికి గురైన మరో వర్గానికి చెందిన యువకులు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. ఈక్రమంలో వారు పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి సిబ్బందితో దురుగా ప్రవర్తిస్తూ, వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో ఆ వర్గానికి చెందిన ఆరుగురితో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

విద్యుత్‌ షాక్‌తో మూడు గేదెలు.. 
1
1/1

విద్యుత్‌ షాక్‌తో మూడు గేదెలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement