నిజామాబాద్‌ | - | Sakshi
Sakshi News home page

నిజామాబాద్‌

Sep 13 2025 2:36 AM | Updated on Sep 13 2025 2:36 AM

నిజామ

నిజామాబాద్‌

న్యూస్‌రీల్‌

రాజీమార్గమే రాజమార్గం

కేసుల పరిష్కారం దిశగా కృషి

నేడు మూడో జాతీయ లోక్‌ అదాలత్‌

జిల్లా న్యాయసేవా సంస్థ చైర్‌ పర్సన్‌,

ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి

చేపలు చేజారుతున్నాయి

ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేసినప్పుడు చేపలు కొట్టుకుపోతున్నాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

శనివారం శ్రీ 13 శ్రీ సెప్టెంబర్‌ శ్రీ 2025

– 8లో u

అభాగ్యులకు అండగా..

జిల్లా జడ్జి జీవీఎన్‌ భరతలక్ష్మి

న్యాయసేవా సంస్థ

‘సత్వరం, సమన్యాయం అందించే జిల్లా న్యాయసేవా సంస్థ ప్రజల పాలిట కామధేనువు, కల్పవృక్షం. అభాగ్యులకు అండగా నిలుస్తోంది. రాజీమార్గమే రాజమార్గం నినాదంతో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించి కేసులు పరిష్కరిస్తోంది.’అని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జీవీఎన్‌ భరతలక్ష్మి పేర్కొన్నారు. శనివారం మూడో జాతీయ లోక్‌ అదాలత్‌ సందర్భంగా న్యాయసేవా సంస్థ లక్ష్యాలు, ప్రజలకు ఉపయోగాలపై ‘సాక్షి’తో మాట్లాడారు.

– నిజామాబాద్‌ లీగల్‌

జాతీయ లోక్‌ అదాలత్‌ను ఎందుకు నిర్వహిస్తున్నారు.. లక్ష్యం ఏమిటీ

దేశంలో కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు లక్షలాది కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. సోషల్‌ మీడియా ప్రభావంతో ప్రజల్లో చట్టాలపై అవగాహన పెరిగి కేసుల సంఖ్య సైతం పెరిగింది. దీంతో కోర్టులపై పనిభారం ఎక్కువైంది. కేసుల్ని పరిష్కరించేందుకు చాలా సమయం పడుతుండటంతో జాతీయ న్యాయసేవా సంస్థ రాజీమార్గమే– రాజమార్గం అనే నినాదంతో ఇరుపక్షాలను లోక్‌అదాలత్‌ ద్వారా ఒక్కచోట చేర్చి వారి సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తోంది.

సాక్షి : న్యాయ సేవా సంస్థ లక్ష్యాలు ఏమిటి

జడ్జి : జాతీయ న్యాయసేవా సంస్థ దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా న్యాయసేవా సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ప్రజలు ఎదుర్కొంటు న్న అనేక సమస్యలపై న్యాయ సహాయం అందించడంతోపాటు పరిష్కార మార్గాలను చూపుతోంది.

ఏ సమస్యలపై న్యాయసేవా సంస్థను

సంప్రదించవచ్చు

ప్రజలు నిత్యజీవితంలో ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై జిల్లా న్యాయసేవా సంస్థను సంప్రదించొచ్చు. భార్యాభర్తలు, కుటుంబ సభ్యుల మధ్య త గాదాలు, కుల సంఘాల, వీడీసీల ఆధిపత్య ధోర ణి, ప్రజా సమస్యలపై స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల నిర్లక్ష్యం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణ, గరిష్ట చిల్లర ధరకన్నా అధికంగా వస్తువులు అమ్మడం, హోటళ్లలో వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేయాలనే నిబంధన విధించడం లాంటి న్యాయ పరిష్కారం ఉన్న అనేక సమస్యలపై ప్రజలకు న్యాయ సహాయం అందిస్తుంది. ప్రజా సమస్యలపై ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించినప్పుడు న్యాయసేవా సంస్థను సంప్రదిస్తే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేస్తాం.

న్యాయం పొందడంపై ప్రజల్లో ఎలా

అవగాహన కల్పిస్తోంది?

గ్రామాలు, పట్టణాల్లో న్యాయ చైతన్య సదస్సులు నిర్వహిస్తోంది. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కోర్టులను ఆశ్రయించకుండానే న్యాయ సహాయం పొందేందుకు ప్రీ–లిటిగేషన్‌, మీడియేషన్‌ వ్యవస్థ ద్వారా వారి మధ్య మధ్యవర్తిత్వం వహించి సమస్యను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. జిల్లా న్యాయసేవా సంస్థ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 15100 సైతం ఏర్పాటు చేసింది.

లోక్‌అదాలత్‌ ఎక్కడెక్కడ

నిర్వహిస్తున్నారు

నిజామాబాద్‌ జిల్లాలో గతంలో నిర్వహించిన రెండో లోక్‌ అదాలత్‌లో 29 వేలకు పైగా కేసుల్ని పరిష్కరించి రాష్ట్రస్థాయిలో మూడో స్థానంలో నిలిచింది. శనివారం జరగబోయే మూడో జాతీయ లోక్‌అదాలత్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించి ఎక్కువ కేసుల్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకోసం నిజామాబాద్‌ జిల్లా కోర్టులో 11, బోధన్‌లో 4, ఆర్మూర్‌లో 3 బెంచ్‌లను ఏర్పాటు చేశాం. మూడు సంవత్సరాలకు మించని శిక్షపడే క్రిమినల్‌ కేసులతోపాటు సివిల్‌, మోటారు వాహనాల కేసులు, ఇతరత్రా కేసులను లోక్‌ అదాలత్‌ ద్వారా పరిష్కరించనున్నాం. ఈ సందర్భంగా నల్సా(నేషనల్‌ లీగల్‌ సర్వీస్‌ అథారిటీ) నినాదమైన మీడియేషన్‌ ఫర్‌ నేషన్‌ (దేశం కోసం రాజీమార్గం) అనే నినాదాన్ని విస్తృతంగా ప్రచారం కల్పిస్తున్నాం.

వీడీసీల పెత్తనాన్ని ఎలా అదుపు చేస్తోంది

ప్రజలపై ఆధిపత్య ధోరణి అవలంబించే గ్రామాభివృద్ధి కమిటీలపై పోరాడేందుకు జిల్లా న్యాయ సేవా సంస్థ సహాయపడుతోంది. జిల్లాలోని పలు వీడీసీలపై అనేకమంది బాధితులు హైకోర్టును సైతం ఆశ్రయించారు. జిల్లా న్యాయసేవా సంస్థ బాధితులను తమ కార్యాలయానికి పిలిపించుకొని ఫిర్యాదులు స్వీకరించి, పోలీసు, రెవెన్యూ తదితర శాఖల సమన్వయంతో వీడీసీలపై చర్యలకు ఆదేశించింది. వీడీసీల ఆర్థిక వనరులైన షాపింగ్‌ కాంప్లెక్స్‌ వంటి వాటిని సీజ్‌ చేయడం, అమాయకులైన ప్రజలను వేధించకుండా చర్యలు చేపట్టాం.

నిజామాబాద్‌1
1/5

నిజామాబాద్‌

నిజామాబాద్‌2
2/5

నిజామాబాద్‌

నిజామాబాద్‌3
3/5

నిజామాబాద్‌

నిజామాబాద్‌4
4/5

నిజామాబాద్‌

నిజామాబాద్‌5
5/5

నిజామాబాద్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement