
17 నుంచి ‘స్వస్థ్ నారీ– స్వశక్త్ పరివార్ అభియాన్’
నిజామాబాద్ నాగారం: మహిళల ఆరోగ్యం పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న ‘స్వస్థ్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని ఈ నెల 17న ప్రధాని మోదీ ప్రారంభిస్తారని డీఎంహెచ్‌వో రాజశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమం అ క్టోబర్ 2 వరకు కొనసాగుతుందన్నారు. కార్యక్రమ నిర్వహణపై రాష్ట్రస్థాయి అధికా రులు శుక్రవారం నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నా రు. ‘స్వస్థ్ నారీ – స్వశక్త్ పరివార్ అభియాన్’లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ఆయుష్మాన్ ఆరో గ్య మందిరాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో ప్రతి రోజు 10 వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. మహిళలు, గర్భిణులకు గుండె సంబంధ, మధుమేహం, క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలతోపాటు కంటి, దంత తదితర పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ తుకారాం రాథోడ్, డాక్టర్ రాజు, డీపీవో విశాల, డీడీఎం నారాయణ, డీహెచ్‌ఈ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.