
కొండ చిలువ పట్టివేత
నందిపేట్(ఆర్మూర్): మండలంలోని అయిలాపూర్ గ్రామంలో గురువారం 9 అడుగుల కొండ చిలువను పట్టుకున్నారు. అయిలాపూర్ గ్రామంలోని ప్రధాన రహదారి వెంబడి గల డ్రెయినేజీలో అలికిడి రావడంతో గ్రామస్తులు చూడగా భారీ పాముగా గుర్తించారు. వెంటనే నందిపేటకు చెందిన పాములు పట్టే సర్వర్‌కు సమచారం అందించారు. వెంటనే సర్వర్ అయిలాపూర్‌కు చేరుకుని గ్రామస్తుల సహకారంతో డ్రెయినేజీలోని కొండ చిలువను పట్టుకుని రోడ్డుపై పడవేశాడు. కొంతసేపు కొండచిలువ అటుఇటుగా తిరగడంతో గ్రామస్తులు భయంతో కేకలు వేశారు. చివరికి దానిని అదుపులోకి తీసుకుని సంచిలో వేశాడు. పట్టుకున్న కొండ చిలువను అటవీ ప్రాంతంలో వదిలేయనున్నట్లు సర్వర్ వివరించాడు.