
భార్యపై హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్ల జైలు
నిజామాబాద్ లీగల్: భార్యను మానసికంగా వేధించి కత్తితో గాయపర్చిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార శిక్షను విధిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ బుధవారం తీర్పు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి. నగరంలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన తురేకార్ రాజమణికి, కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సిర్పూర్‌కు చెందిన సోన్ కాంబ్లె యాదవ్‌తో 2018 లో వివాహమైంది. కాంబ్లె మద్యం తాగుతూ భార్య సంపాదనపై ఆధారపడేవాడు. ఆమె నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తుండేది. 27మే2021న ఆస్పత్రికి వెళ్లి తన వెంట రావాలని గొడవ చేశాడు. దీంతో ఆమె రాను అనడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమైపె దాడి చేశాడు. పోలీసులు కాంబ్లైపె కేసు నమోదు చేశారు. బుధవారం నిందితుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో జడ్జి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. వెయ్యి జరిమానాను విధించారు. జరిమానా చెల్లించకుంటే అదనంగా నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని జడ్జి తీర్పులో పేర్కొన్నారు.