
మంజీర నది కౌలు రైతులు దాసరి శంకర్, అల్లె మొగులయ్య సాగు చేసిన వరి పరిస్థితి ఇది
సాలూరలో 9,240 ఎకరాల్లో నష్టం
ఎన్నో ఆశలతో సాగు చేసిన పంట కళ్ల ముందే కొట్టుకుపోయింది. వరద తాకిడితో నేల చూపు చూస్తున్న వరి, సోయా ఇక ఎదిగే అవకాశం లేక మురిగిపోతోంది. మంజీర పరీవాహక ప్రాంతమైన సాలూర మండలంలో 9,240 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు ఏవో శ్వేత తెలిపారు.
5,090 ఎకరాల్లో సోయా, 3,960 ఎకరాల్లో వరి, 115 ఎకరాల్లో అరటి, 50 ఎకరాల్లో కూరగాయలు, 25 ఎకరాల్లో చెరుకు పంటలకు నష్టం వాటిల్లింది. – బోధన్

నిజామాబాద్