
ఎకరానికి రూ. 25వేల నష్టపరిహారం ఇవ్వాలి
వేల్పూర్: బాల్కొండ నియోజకవర్గంలో వరదల వ ల్ల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 25వేల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని బా ల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వేల్పూర్, భీమ్‌గల్ మండలాల్లో వరద ఉధృతికి దెబ్బతిన్న పంటలను, రహదారుల ను శుక్రవారం ఆయన సంబంధిత అధికారులు, నా యకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఎమ్మె ల్యే మాట్లాడుతూ.. ప్రాథమిక లెక్కల ప్రకారం 1162 ఎకరాల్లో వరి, 95 ఎకరాల్లో మొక్కజొన్న, 35 ఎకరాల్లో సోయాబిన్ పంట దెబ్బతిందని అధికారులు చెప్పారన్నారు. మరొక్కసారి పంటనష్టంపై క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించాలని అధికారులకు సూచించారు. అ లాగే రోడ్లు, వంతెనల మరమ్మతులకు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలన్నారు. తాను సైతం మంత్రులకు నివేదించి పనులు త్వరగా పూర్తయ్యేలా కృషి చేస్తానని చెప్పారు. ప్రజలెవరూ నీటి ప్రవాహాల వద్దకు వెళ్లవద్దని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.