
అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్‌అర్బన్: వరద ముప్పు పొంచి ఉన్న ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ వినయ్‌కృష్ణారెడ్డి ఆదేశించారు. రానున్న 48 గంటలపాటు భారీ వ ర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి పోలీస్ కమిషనర్ సాయిచైతన్య తో కలిసి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం ఉ దయం నుంచి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతా ల్లో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించారు. అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటికి రావాలని ప్రజలకు సూచించారు. లోతట్టు ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలు, తెగిన విద్యుత్ వైర్ల వద్దకు వెళ్లొద్దన్నారు. అవసరమైన చోట్ల పోలీసు బందోబస్తు, పికెటింగ్ ఏర్పా టు చేయించాలని ఆదేశించారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లల్లో ఉంటున్న వారిని తక్షణమే ఖాళీ చేయాలన్నా రు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరద ముంపు ప్రాంతాల ప్రజలను
సురక్షిత ప్రాంతాలకు తరలించాలి
అవసరమైన చోట్ల పోలీసు
బందోబస్తు, పికెట్
అధికారులకు కలెక్టర్
వినయ్‌కృష్ణారెడ్డి దిశానిర్దేశం