
చెరువు మట్టి.. చేనుకు బలం
ధర్పల్లి: పంట దిగుబడి పెరుగుదలకు రైతులు పొలాల్లో ఎడాపెడా ఎరువులు, రసాయనాలు చల్లుతున్నారు. పెరిగిన ఎరువుల ధరలతోపాటు పంటలకు అధికంగా ఎరువులు వాడడంతో పెట్టుబడి ఖర్చు పెరుగుతోంది. మరోవైపు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడుతుండడంతో భూసారం కూడా దెబ్బతింటుంది. దీంతో రైతులు పొలంలో చెరువు మట్టిని పోయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
చెరువు మట్టితో ప్రయోజనాలు
● చెరువు మట్టిని పొలాల్లో వేయడంతో ఆమ్ల, క్షార గుణాలతో భూమి బలంగా మారుతుంది.
● నేలలో లవణాల గాఢత తగ్గుతుంది.
● రసాయనిక ఎరువుల వాడకం కొంతమేర తగ్గుతుంది.
● మొక్కలు ఆరోగ్యంగా, ఎత్తుగా పెరిగి అధిక దిగుబడి వస్తుంది.
● చెరువు మట్టితో నేలకు అన్ని పోషకాలు అందుతాయి. నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది.
● నల్లమట్టిలో సేంద్రియ కర్బనం, సూక్ష్మ పోషక మూలకాలు అధికంగా ఉంటాయి. దీంతో మొక్కలు రోగ నిరోధక శక్తిని కల్గి ఉంటాయి.
వేసవిలో అనుకూలం..
వేసవికాలంలో చెరువులు ఎండిపోవడంతో పూర్తిగా నల్లమట్టి లభిస్తుంది. సులభంగా పూడిక తీసి తరలించేందుకు అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం పంట పొలాలు పూర్తిస్థాయిలో ఖాళీగా ఉండడంతో ట్రాక్టర్లు, టిపర్ల ద్వారా చెరువు మట్టిని తరలిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి
సారవంతంగా మారనున్న భూమి
భూసారం పెరుగుతుంది
చెరువు మట్టితో భూసారం పె రుగుతుంది. స్థానిక వనరులను ఉపయోగించి స్థిరమైన వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తుంది. చె రువు మట్టిని ఇతర నేలతో కలి పి ఉపయోగించడంతో మొక్క ల వేర్లకు అవసరమైన గాలి, నీరు, సమతుల్యంగా అందుతాయి. – వెంకటేశ్, వ్యవసాయాధికారి, ధర్పల్లి

చెరువు మట్టి.. చేనుకు బలం