
వేర్వేరు ఘటనల్లో బాలుడు, మరో ముగ్గురి మృతి
గాంధారి/ లింగంపేట: బంధువుల పెళ్లికి వచ్చి ఓ బాలుడు మృతి చెందిన ఘటన గాంధారి మండల పరిధిలోని ఎక్కకుంట తండాలో చోటు చేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపేట్ మండలం కొండాపూర్ తండాకు చెందిన లలిత, రాజ్‌కుమార్ దంపతులు వారి రెండేళ్ల కుమారుడు సాత్విక్(2)తో కలిసి బుధవారం బంధువుల పెళ్లికి ఎక్కకుంట తండాకు వచ్చారు. బయట పెళ్లి వంటలు చేసి ఉంచారు. రాత్రి వర్షం రావడంతో వండిన వంట పాత్రలను ఇంట్లో పెట్టారు. సాంబారు పాత్రపై మూత వేయడం మర్చిపోయారు. సాత్విక్ ప్రమాదవశాత్తు వేడిగా ఉన్న సాంబారులో పడిపోయాడు. గమనించిన బంధువులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఈ విషయమై ఎస్సై ఆంజనేయులును సంప్రదించగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
కారు ఢీ కొని ఒకరు..
మాచారెడ్డి: కారు ఢీ కొన్న ఘటనలో ఓ సైక్లిస్ట్ మృతి చెందాడు. ఎస్సై అని ల్ తెలిపిన వివరాల ప్రకారం.. పా ల్వంచ మండల కేంద్రానికి చెందిన మాస్తు చిన్న సిద్ధయ్య(57) గురువా రం రాత్రి పాల్వంచ మర్రి నుంచి సైకిల్ పై పాల్వంచకు వెళ్తుండగా కామారెడ్డి వైపు నుంచి అతి వేగం, అజాగ్రత్తగా వస్తున్న కారు ఢీకొన్నది. సిద్ధయ్య తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు..
భిక్కనూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందినట్లు ఎస్సై ఆంజనేయులు శుక్రవారం తెలిపారు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన పోతుల రాహుల్ అనే యువకుడు బైక్‌పై కామారెడ్డి నుంచి భిక్కనూరు మండల కేంద్రానికి గురువారం వస్తుండగా టోల్ ప్లాజా వద్ద వెనుక నుంచి కారు ఢీకొన్నది. ఈ ఘటనలో అతనికి తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
బైక్ అదుపుతప్పి మరొకరు..
బిచ్కుంద: బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై మోహన్‌రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతడ్గూర్‌కు చెందిన మంగళి సునీల్, భార్య జ్యోతి(26)తో కలిసి బైక్‌పై బిచ్కుందుకు వస్తున్నారు. బిచ్కుంద శివారులో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి కింద పడడంతో జ్యోతి తలకు తీవ్రగాయమైంది. స్థానికులు బాన్సువాడ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

వేర్వేరు ఘటనల్లో బాలుడు, మరో ముగ్గురి మృతి

వేర్వేరు ఘటనల్లో బాలుడు, మరో ముగ్గురి మృతి

వేర్వేరు ఘటనల్లో బాలుడు, మరో ముగ్గురి మృతి