
వర్షానికి కూలిన ఇల్లు
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ పట్టణంలో మూడు రోజులు కురుస్తున్న వర్షాలకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు అంతర్గత రోడ్లు చిత్తడిగా మారాయి. వాహనదారులకు గుంతలు కనిపించకపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నారు. రైతుబజార్ వర్షానికి చిత్తడిగా మారడంతో విక్రయదారులు, కొనుగోలుదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏకదాటిగా కురుస్తున్న వర్షానికి సంతోష్‌నగర్ కాలనీకి చెందిన సత్యనారాయణ అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మున్సిపల్ అధికారులు కూలిన ఇంటిని పరిశీలించారు.

వర్షానికి కూలిన ఇల్లు