
జక్రాన్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
జక్రాన్‌పల్లి: మండలంలోని వివేక్‌నగర్ తండా సమీపంలో 44 నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్‌ను వెనుక నుంచి కంటైనర్ ఢీకొనడంతో వివేక్‌నగర్ తండాకు చెందిన బానోత్ శ్రీనివాస్ (35), కేశ్‌పల్లి తండాకు చెందిన బాదావత్ నవీన్ (27) అక్కడికక్కడే మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. బానోత్ శ్రీనివాస్ తన అన్న శంకర్ నాయక్ పెళ్లిరోజును పురస్కరించుకొని కేక్ తీసుకురావడం కోసం జక్రాన్‌పల్లి మండల కేంద్రానికి వెళ్లారు. కేక్ తీసుకొని తిరిగి వస్తుండగా వివేక్‌నగర్ తండా సమీపంలో జాతీయ రహదారిపై వెనుక నుంచి వచ్చిన కంటైనర్ బైక్‌ను ఢీకొన్నది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న బానోత్ శ్రీనివాస్, బాదావత్ నవీన్ కొద్దిదూరం ఎగిరిపడి అక్కడికక్కడే మృతి చెందారు. కంటైనర్ పల్టీ కొట్టింది. ఘటనా స్థలాన్ని ఎస్సై మాలిక్ రెహమాన్ పరిశీలించి, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్ కేబుల్ టీవీ నిర్వహిస్తుండగా, భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. బాదావత్ నవీన్ ఆర్టీసీ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బస్సును సొంతంగా కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దెకి నిర్వహిస్తున్నారు. నవీన్‌కు ఇంకా పెళ్లి కాలేదు. కాగా, మృతులిద్దరూ స్వయాన బావబామ్మర్దులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బైక్‌ను ఢీకొట్టిన కంటైనర్
ఇద్దరు దుర్మరణం
మృతులు బావబామ్మర్దులు

జక్రాన్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

జక్రాన్‌పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం