
ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు
ఆర్మూర్‌టౌన్: అత్యంత అరుదైన గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న నరేశ్ చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ కొండ్రపేట నరేశ్ వారం రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ఆర్మూర్‌తో పాటు నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చూయించినా చికిత్స అందలేదు. పరిస్థితి విషమిచండంతో ఐదురోజుల క్రితం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు నరేశ్ గిలియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్నట్లు గుర్తించారు. వ్యాధి తీవ్రత ఎక్కువ కావడంతో అతని కాళ్లు, చేతులు చచ్చిపడిపోయాయి. చికిత్స కోసం రూ. 2 నుంచి రూ. 3లక్షల వరకు ఖర్చు అవుతోంది. చిన్ననాడే తండ్రిని కోల్పోపోయిన నరేశ్ తల్లితో పాటు ఇద్దరు తమ్ముళ్ల బాగోగులు చూస్తు పెద్దదిక్కుగా మారాడు. ఉన్నఫలంగా అరుదై న వ్యాధి సోకడంతో కుటుంబం తల్లడిల్లిపోతోంది. నరేశ్‌కు మూడేళ్ల క్రితం వివాహం కాగా రెండేళ్ల బాబు ఉన్నాడు. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో చికిత్స కోసం ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం, దాతలు స్పందించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నరేశ్ ఫోన్ పే నంబర్ 8688365656, ఎస్‌బీఐ ఐఎఫ్‌సీ కోడ్ ఎస్‌బీఐఎన్0020894, అకౌంట్ నంబర్ 62148693494కు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు.