
జీజీహెచ్‌లో పెచ్చులూడిన సీలింగ్
నిజామాబాద్ నాగారం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో జీజీహెచ్ మొదటి అంతస్తులో పెచ్చులూడుతున్నాయి. శుక్రవారం రూంనంబర్ 178లో బెడ్ నంబర్ 11పై నవజాత శిశువు ఉండగా ఘటన చోటు చేసుకుంది. సీలింగ్ పెచ్చులు ఊడి నాలుగు రోజుల క్రితం ఫాతిమా బేగంకు జన్మించిన పాప ముఖంపై పడ్డాయి. దీంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తంచేశారు. స్పందించిన సిబ్బంది శిశువును మరో వార్డుకు తరలించి చికిత్స అందించారు.
● నవజాత శిశువుకు గాయాలు
● తప్పిన పెను ప్రమాదం

జీజీహెచ్‌లో పెచ్చులూడిన సీలింగ్