ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్‌ఫ్లో

May 23 2025 5:35 AM | Updated on May 23 2025 5:35 AM

ఎస్సారెస్పీలోకి  స్వల్ప ఇన్‌ఫ్లో

ఎస్సారెస్పీలోకి స్వల్ప ఇన్‌ఫ్లో

బాల్కొండ: ఎగువ ప్రాంతాల్లో రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి 2,863 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలువ ద్వారా 100, మిషన్‌ భగీరథకు 231, ఆవిరి రూపంలో 321 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటి మట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికి ప్రాజెక్ట్‌లో 1061.10 (11.6 టీఎంసీలు) అడుగుల నీరు నిలువ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు పేర్కొన్నారు. మున్ముందు వరద మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.

సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక బస్సులు

ఖలీల్‌వాడి: కాళేశ్వరంలో జరుగుతున్న సర స్వతి పుష్కరాల సందర్భంగా ప్రత్యేక బస్సు లు నడుపుతున్నట్లు నిజామాబాద్‌–1 డిపో మేనేజర్‌ ఆనంద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23 నుంచి 26 వరకు ప్రతి రోజు ఉదయం 6 గంటలకు నిజామాబాద్‌ బస్టాండ్‌ నుంచి కాళేశ్వరం పుణ్యక్షేత్రానికి ఎక్స్‌ప్రెస్‌ బస్సు నడుపుతున్నట్లు పేర్కొన్నారు. టికెట్‌ ధర పెద్దలకు రూ.560, పిల్లలకు రూ.290 ఉంటుందన్నారు. కాళేశ్వరం నుంచి ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు బస్సు బయల్దేరుతుందని పేర్కొన్నారు.

‘దోస్త్‌’ ప్రత్యేక కేటగిరి ధ్రువపత్రాల పరిశీలన

తెయూ(డిచ్‌పల్లి): దోస్త్‌ ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశా లకు రిజస్ట్రేషన్‌ చేసుకున్న ప్రత్యేక కేటగిరి విద్యార్థుల ధ్రువపత్రాలను తెలంగాణ యూనివర్సిటీ వర్సిటీ అడ్మిషన్స్‌ కార్యాలయంలో గురువారం పరిశీలించారు. ఎన్‌సీసీ 14, స్పోర్ట్స్‌ 2, పీహెచ్‌సీ (దివ్యాంగులు) 1 అభ్యర్థులు పరిశీలనకు హాజరైనట్లు తెయూ దోస్త్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ వాసం చంద్రశేఖర్‌ తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనలో ఎన్‌సీసీ ఆఫీసర్‌ డాక్టర్‌ రామస్వామి, తెయూ ఫిజికల్‌ డైరెక్టర్‌ బీఆర్‌నేత, టెక్నికల్‌ అసిస్టెంట్‌ నరేశ్‌, రవీందర్‌నాయక్‌ పాల్గొన్నారు.

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో కొనసాగుతున్న డిగ్రీ రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ సెమిస్టర్‌ పరీక్షల్లో గురువారం మోర్తాడ్‌ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ ఒక విద్యార్థి డిబార్‌ అయినట్లు ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ ప్రొ ఫెసర్‌ ఘంటా చంద్రశేఖర్‌ తెలిపారు. వర్సి టీ పరిధిలోని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా లో ఏర్పాటు చేసిన 32 పరీక్ష కేంద్రాల్లో 13,366 మంది విద్యార్థులకు 12,303 మంది హాజరు కాగా 1,063 మంది గైర్హాజరైనట్లు వెల్లడించారు. ఉదయం జరిగిన 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 5వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 6,395 మంది విద్యార్థులకు 5,898 మంది హాజరుకాగా 497 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, 3వ సెమిస్టర్‌ బ్యాక్‌లాగ్‌ పరీక్షలకు 6,971 మంది విద్యార్థులకు 6,355 మంది హాజరు కాగా 616 మంది గైర్హాజరైనట్లు తెలిపారు.

విద్యార్థులను సురక్షితంగా ఇంటికి చేర్చాలి

డీటీవో ఉమా మహేశ్వర్‌ రావు

పెర్కిట్‌ (ఆర్మూర్‌): విద్యార్థులను కుటుంబ సభ్యులుగా భావించి గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చాలని జిల్లా రవాణా శాఖ అధికా రి ఉమా మహేశ్వర్‌ రావు సూచించారు. ఆ ర్మూర్‌ మండల ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పాఠశాల, కళాశాలల బ స్సు డ్రైవర్లకు గురువారం అవగాహన సద స్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజ రైన డీటీవో మాట్లాడుతూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు. ఆర్మూర్‌ ఎంవీఐ వివేకానంద రెడ్డి మాట్లాడు తూ స్కూల్‌ బస్సులకు తప్పనిసరిగా ఫిట్‌నె స్‌ పరీక్షలు చేయించుకోవాలన్నారు. వాహన తనిఖీల్లో మైనర్లు పట్టుబడితే యజమానులపై కేసులు నమోదు చేస్తామన్నారు. సదస్సులో ప్రైవేటు స్కూల్స్‌ అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు భరత్‌చంద్ర మల్లయ్య, విద్య ప్రవీణ్‌, వేణు, మానస గణేశ్‌, కాంతి గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement