
రూ.400 కోట్లు దాటిన బంగారు రుణాలు
సుభాష్‌నగర్: ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మంజూరు చేసిన బంగారు రుణాలు రూ.400 కోట్ల మైలురాయి చేరుకున్నాయి. ఈ సందర్భంగా నగరంలోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో గురువారం చైర్మన్ కుంట రమేశ్ రెడ్డి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బంగారు రుణాలు రూ.400 కోట్ల మైలురాయి చేరడంలో ప్రతి ఉద్యోగి పాత్ర ఉందన్నారు. బ్యాంకు ప్రగతిని ఇదే విధంగా కొనసాగించి, రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే మెరుగైన స్థితికి తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సీఈవో నాగభూషణం వందే, జీఎం లింబాద్రి, గజానంద్, సుమమాల, ప్రధాన కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్‌డీసీసీబీ చైర్మన్ రమేశ్ రెడ్డి