దంచికొట్టిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం

May 11 2025 12:16 PM | Updated on May 15 2025 5:09 PM

బాల్కొండ: బాల్కొండ, ముప్కాల్‌, మెండోరా మండలాల పరిధిలో శనివారం రాత్రి అకాలవర్షం దంచి కొట్టింది. దీంతో కల్లాల్లో ఉన్న సజ్జలు, నువ్వులు, కొనుగోలు కేంద్రాల్లోని వరి ధాన్యం తడిసి ముద్దయింది. సుమారు 40 నిమిషాలపాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉరుములు, మెరుపులతో వాన కురవడంతో ప్రజలు భయాందోళన చెందారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నదాతలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రశాంతంగా టీజీఆర్‌జేసీ 

నిజామాబాద్‌అర్బన్‌: తెలంగాణ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలో ప్రవేశానికి శనివారం జిల్లా కేంద్రంలో టీజీఆర్‌జేసీ పరీక్ష నిర్వహించారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 7,483 మంది విద్యార్థులకు 6,564 మంది హాజరుకాగా, 919 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

చురుగ్గా సాగుతున్న చెక్‌డ్యాం పనులు

సిరికొండ: మండలంలోని గడ్కోల్‌ శివారులో కప్పలవాగుపై నిర్మిస్తున్న చెక్‌ డ్యాం పనులు చురుగ్గా సాగుతున్నాయి. చెక్‌డ్యాం నిర్మాణ పనులకు నీటి పారుదల శాఖ ద్వారా రూ.2.46 కోట్ల నిధులు మంజూరయ్యాయి. పనులకు గత నెల 4న ఎమ్మెల్యే భూపతిరెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను ప్రారంభించిన కాంట్రాక్టర్‌ పనులను ము మ్మరంగా చేపడుతున్నారు. వాగు అడుగు భాగం నుంచి ర్యాఫ్ట్‌ పనులు భూమిపై భా గం వరకు చేపట్టారు. మరో 30 మీటర్ల మేర పనులు చేపట్టాల్సి ఉంది. కప్పలవాగుపై చెక్‌డ్యాం నిర్మాణం పూర్తయితే భూగర్బ జలాలు పెరిగే అవకాశం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.

కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు

మాచారెడ్డి : చుక్కాపూర్‌లోని లక్ష్మీనర్సింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు కొనసాగు తున్నాయి. శనివారం ఉదయం సేవాకాలం శాంతిపాఠం నిర్వహించారు. అనంతరం ద్వారతోరణ పూజలు, మూలమంత్ర హవనం, ఉత్సవ మూర్తులకు పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ కమలాకర్‌రెడ్డి, ఈవో శ్రీధర్‌రావ్‌, డైరెక్టర్లు లక్ష్మీరాజం, రాజిరెడ్డి, ఆంజనేయులు, బాల్‌రెడ్డి, ఆలయ సిబ్బంది సంతోష్‌ తదితరులు పాల్గొన్నారు.

నియామకం

జక్రాన్‌పల్లి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఆర్‌ఐ పాలసీ సలహామండలి సభ్యుడిగా కలిగోట్‌ గ్రామానికి చెందిన సత్యంగౌడ్‌(దుబాయ్‌)నియమితులయ్యారు. ఈసందర్భంగా దుబాయ్‌లో ఉంటున్న ఎన్నారైలు శనివారం సత్యంగౌడ్‌ను కలిసి, సత్కరించారు. విజయ్‌రెడ్డి, నర్స య్య, మద్దుల శ్రీనివాస్‌, రమేష్‌, కాశాగౌడ్‌, మచ్చెంధర్‌, మోహన్‌, కొట్టాల శ్రీనివాస్‌, చిన్ని, తదితరులు పాల్గొన్నారు.

దంచికొట్టిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం1
1/1

దంచికొట్టిన వాన.. తడిసి ముద్దయిన ధాన్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement