
పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గుచేటు
ఆర్మూర్‌టౌన్/బోధన్: నిజాలను నిర్భయంగా రా స్తున్న ‘సాక్షి’ దినపత్రికను అణగదొక్కేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని, ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటిపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టులు అన్నారు. ధనంజయ్‌రెడ్డి ఇంట్లో పోలీసుల సోదాలను నిరసిస్తూ శనివారం ఆర్మూర్, బోధన్ పట్టణాల్లో జర్నలిస్టులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమర్పించారు. ఆర్మూర్‌లో జర్నలిస్టు యూనియన్ ఫర్ స్టేట్ ఆఫ్ తె లంగాణ జిల్లా అధ్యక్షుడు నరసింహచారి, సాక్షి దినపత్రిక బ్యూరో ఇన్‌చార్జి భద్రారెడ్డి, బోధన్‌లో ప్రింట్ మీడియా జర్నలిస్ట్ సంఘాల నాయకులు తేళ్ల రవికుమార్, లింటూరి లక్ష్మణ్ మాట్లాడారు. సాక్షి ఎడిటర్ ధనంజయ్‌రెడ్డి ఇంటిపై ఏపీ రాష్ట్ర పోలీసుల దాడి, సోదాలను ఏపీ కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే పరిగణిస్తామని అన్నారు. ప త్రికా స్వేచ్ఛను కాపాడుకుందామని, ధనంజయ్‌రెడ్డిపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని అన్నా రు. ఏ ప్రభుత్వానికై నా అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు గుర్తించాలని, ఏపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని హితవు పలికారు. లేని పక్షంలో భవిష్యత్‌లో పెద్ద ఎ త్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు.
ఆర్మూర్‌లో జర్నలిస్టులు సురేశ్, వెంకట్, క్రాంతి, రాజేశ్, శేఖర్, భూమేశ్, సాగర్, పోశెట్టి, బోధన్‌లో బండారి సాయిలు, ఉమాకాంత్, ఖుర్షిద్, న ల్వాల విజయ్, సూర్య ప్రకాశ్, రాము, తారాచంద్, కారం స్వామి, రమేశ్, జగన్, కడికే శివ, రాజేశ్, అ శోక్, రాజేశ్వర్, అంజి, నవీన్, దిలీప్, నాగభూషణం, అఫ్రోజ్, సాక్షి బోధన్ ఆర్‌సీ ఇంచార్జీ గడ్డం గంగులు, సాక్షి టీవీ రిపోర్టర్ తోకల రవి, గణేశ్, నల్వాల క్రిష్ణ, శ్రీనివాస్, అనిల్, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీలోని కూటమి ప్రభుత్వానివి
కక్ష సాధింపు చర్యలు
సాక్షి ఎడిటర్‌పై ధనంజయరెడ్డి
ఇంటిపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం
నిరసన కార్యక్రమాల్లో జర్నలిస్టులు

పత్రికా స్వేచ్ఛపై దాడి సిగ్గుచేటు