
పెళ్లయిన తొమ్మిది నెలలకే..
మాచారెడ్డి : కామారెడ్డి జిల్లా పాల్వంచ మండ ల కేంద్రానికి చెందిన గ్రే హౌండ్స్ విభాగంలో ప నిచేస్తున్న కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ (30) ములు గు జిల్లా పేరూరు పోలీ సు స్టేషన్ పరిధి వాజేడు ఏరియాలో గురువా రం ఉదయం నక్సలైట్లుమందుపాతర పేల్చడంతో ప్రాణాలు కోల్పోయాడు. కామారెడ్డిలో డిగ్రీ పూర్తి చేసిన తరువాత 2020లో టీఎస్‌పీఎస్సీ పరీక్ష రాసి తొలి ప్రయత్నంలోనే ఏడో బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా ఎంపికయ్యాడు. అక్కడే శిక్షణ పూర్తి చేసుకున్న శ్రీధర్ రెండేళ్ల కిందట గ్రే హౌండ్స్ విభాగంలోకి వెళ్లాడు. హైదరాబాద్ కేంద్రంగా గ్రేహౌండ్స్ విభాగంలో పనిచేస్తున్నా డు. తల్లి లక్ష్మి, భార్య శ్రీవాణితో కలిసి అక్కడే ఉంటూ విధులకు హాజరవుతున్నాడు. నక్సల్స్ ఏరివేతలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ చేపట్టాయి. గ్రేహౌండ్స్ బృందంతో కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా నక్స ల్స్ మందుపాతర పేల్చడంతో శ్రీధర్ మృతిచెందినట్టు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించా రు. కాగా శ్రీధర్‌కు 2024 ఆగస్టు 22న వివాహ మైంది. ఏడాది గడవకముందే శ్రీధర్ ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు కంటతడిపెట్టారు. శ్రీధర్ తండ్రి గంగారాం కొన్నేళ్ల కిందట అనారోగ్యంతో చనిపోయాడు. పోలీసులు అందించిన సమాచారంతో శ్రీధర్ కుటుంబ సభ్యులు, గ్రా మస్తులు వరంగల్‌కు తరలివెళ్లారు. అక్కడ పోలీ సు అధికారులు శ్రీధర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహం రాత్రి వరకు పాల్వంచకు చేరుకుంది.
● నక్సల్స్ చేతిలో బలైన గ్రేహౌండ్స్
కానిస్టేబుల్
● పాల్వంచ మండల కేంద్రంలో విషాదం