
మార్పులు, చేర్పులకే ప్రాధాన్యం
మోర్తాడ్(బాల్కొండ): కొత్త రేషన్ కార్డుల జారీ కోసం చేపట్టిన సర్వే నత్తనడకన సాగుతుంది. పాత కార్డులలో పేర్లు చేర్చడం, ఏవైనా మార్పు లు చేర్పులు చేయడం కోసం వచ్చిన దరఖాస్తులకే ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తుంది. రేషన్‌కార్డులు పొందడానికి అర్హులై ఉండి ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న వారికి కొంతకాలం ఎదురు చూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఎంపిక చేసిన గ్రామాల్లోనే..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రకటనలు చేస్తున్నా ఆచరణలో మాత్రం ముందుకుసాగడం లేదు. గడచిన గణతంత్ర దినోత్సవం రోజున జిల్లాలో ఎంపిక చేసిన 31 గ్రామాలలోనే కొత్త రేషన్ కార్డుల జారీ చేశారు. మిగిలిన గ్రామాలలో కార్డులను జారీ చేయాల్సి ఉండగా సర్వే నిర్వహించాలని అధికారులను ప్రభుత్వం నిర్దేశించింది. ప్రజాపాలనలోనూ, మీ సేవా కేంద్రాల్లో ఆన్‌లైన్‌లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇంటికి వెళ్లి అధికారులు సర్వే నిర్వహించనున్నారు. రెవెన్యూ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సిబ్బంది నుంచి ఇతర హోదాల ఉద్యోగుల వరకూ ఇంటింటి సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ సర్వేలో తొలి ప్రాధాన్యతగా కార్డులలో అదనపు పేర్లు నమోదు చేయడం తప్పా మరే ఇతర అంశాలను లెక్కలోకి తీసుకోవడం లేదు.
పెండింగ్‌లో 77వేలకు పైగా దరఖాస్తులు
దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులలో కుటుంబ సభ్యులను చేర్చడం చేయలేదు. మరణించిన వారి పేర్లు తొలగించినా పు ట్టిన వారి పేర్లు చేర్చడం, పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చిన యువతుల పేర్లు నమోదు చే యడం, ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు, దే శాలకు వలస వెళ్లిన వారి పేర్లు తొలగించగా వా రిని మళ్లి చేర్చడం అసలే జరుగలేదు. అలా పే ర్లు నమోదు చేయాలని వచ్చిన దరఖాస్తులు జి ల్లా వ్యాప్తంగా 77,758 వరకూ పెండింగ్‌లో ఉ న్నాయి. పౌర సరఫరాల శాఖ వెబ్‌పోర్టల్ బ్లాక్ చేసి ఉండటంతో ఇంకా అనేక మంది ద రఖాస్తు చేసుకోవాలని ఆసక్తి చూపినా వారికి ఇ టీవలనే పేర్ల నమోదుకు అవకాశం ఏర్పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు ప రిష్కరించడానికి ఇప్పుడు మార్గం సుమగమైంది.
నత్తనడకన సాగుతున్న
కొత్త రేషన్ కార్డుల సర్వే
నూతన కార్డుల జారీకి తీవ్ర జాప్యం
కొత్త కార్డుల కోసం 80వేలకు పైగా దరఖాస్తులు..
కొత్తగా కార్డులు కావాలని జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలనలో 81,148 కుటుంబాల నుంచి ఆర్జీలు అధికారులకు అందాయి. జనవరి 26న తొలి విడతగా 1066 కుటుంబాలకు కొత్త కార్డులను అధికారులు, ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. మరో 80వేలకు మించి దరఖాస్తులను పరిశీలించి కొత్త కా ర్డులను జారీ చేయాల్సి ఉంది. ప్రస్తుతం రే షన్ షాపుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేయడం, సంక్షేమ పథకాల అమలుకు రేష న్ కార్డు ప్రామాణికం కావడంతో కార్డులు లేనివారు భారీగా దరఖాస్తు చేస్తున్నారు. జారీ చేసే కార్డుల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశా లు అందాయి. అనర్హులకు కార్డులు జారీ చే స్తే ఉద్యోగులను ఇంటికి పంపిస్తామని హెచ్చరికలు సైతం జారీ చేశారు. అనర్హులకు కార్డులు జారీ చేయకూడదనే నిబంధన పాటించడం మంచిదే కానీ అర్హులైన వారికి మాత్రం కార్డులను జారీ చేయడంలో జాప్యం వద్దనే అభిప్రాయం వ్యక్తం అవు తుంది.
సర్వే కొనసాగుతుంది..
రేషన్ కార్డులలో మార్పులు, చేర్పులు, కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులకు సంబంధించి సర్వే కొనసాగుతుంది. తొలి విడతగా మార్పులు చేర్పులపై ఉద్యోగులు వివరాలను సేకరిస్తున్నారు. కొత్త కార్డుల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలన కూడా త్వరలో పూర్తి చేస్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు.
– కృష్ణ, తహసీల్దార్, మోర్తాడ్