
పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టు
కామారెడ్డి టౌన్: ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ధ నుంజయ్‌రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పోలీసుల వేధింపులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో జ ర్నలిస్టులు గురువారం నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చందర్‌నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం మున్సిపల్ కా ర్యాలయం ప్రాంతంలో ఉన్న అంబేడ్కర్ విగ్ర హం వద్ద కొవ్వొత్తులను ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ప్రజల పక్షాన వార్తలు రాస్తున్న ‘సాక్షి’ దినపత్రికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడం సిగ్గుచేటని సీనియర్ జర్నలిస్టులు వేణుగోపాలచారి, రజనీకాంత్, శ్రీనివాస్ తదితరులు మండిపడ్డారు. సాక్షి ఎడిటర్‌పై దాడి, అక్రమ కేసులు, ఆయన ఇంట్లో సోదాలు ప్రత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టుఅని అన్నారు. కక్షపూరిత మైన చర్యలను మానుకోనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. జర్నలిస్టులు పట్నం శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఆబీద్, అ ర్షద్, వెంకటేశ్, రాజేశ్, రమేశ్, సంగరాజు, అన్వ ర్, ప్రభు, సురేశ్, కౌసర్, హరీశ్ పాల్గొన్నారు.
లైసెన్స్‌డ్ ల్యాండ్ సర్వేయర్ల
శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ అర్బన్: లైసెన్స్‌డ్ ల్యాండ్ సర్వేయర్ల శిక్షణకు ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు మీ సేవా కేంద్రాల్లో ఈ నెల 17లోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భూ భారతి చట్టం అమలులో భాగంగా సర్వే, ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో అర్హత కలిగిన సర్వేయర్లు సరిపడా సంఖ్యలో లేనందున, 2025–26 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లను ఎంపిక చేసి, వారికి శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. లైసెన్సు సర్వేయర్‌గా ఎంపికై న వారు నెలకు సుమారు రూ.30 వేలకు పైగా ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని కలెక్టర్ సూచించారు. లైసెన్స్ సర్వేయర్‌గా ఎంపికై న వారికి జిల్లా కేంద్రంలో ఈ నెల 26 నుంచి జూలై 26 వరకు శిక్షణ అందిస్తామన్నారు. అనంతరం నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారికి లైసెన్స్ ఇస్తామన్నారు. శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 17.05.2025 నాటికి ఓసీ, బీసీలు అయితే 18 నుంచి 35 సంవత్సరాల లోపు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 18 నుంచి 40 సంవత్సరాల లోపు వయస్సు, ఇంటర్, డిప్లొమా సివిల్ ట్రేడ్, వొకేషనల్, నిర్దేశిత కోర్సులు చదివిన వారు అర్హులని తెలిపారు. శిక్షణ కోసం ఓసీ అభ్యర్థులు రూ. 10 వేలు, బీసీలు రూ. 5 వేలు, ఎస్సీ/ఎస్టీలు రూ. 2,500 రుసుము చెల్లించాలని పేర్కొన్నారు.
● ‘సాక్షి‘ ఎడిటర్ ధనుంజయ్‌రెడ్డిపై
ఏపీ ప్రభుత్వం వేధింపులు
● కామారెడ్డిలో జర్నలిస్టుల నిరసన