
రైతు ఉత్పత్తిదారుల సంఘాల కాలపరిమితి పెంచాలి
నిజామాబాద్ సిటీ: అభివృద్ధి చెందుతున్న రైతు ఉత్పత్తిదారుల సంఘాల కాలపరిమితిని పెంచాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సాయినగర్‌లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు నాయకుడు ఆకుల పాపయ్య మాట్లాడుతూ.. దేశంలోనే రైతు ఉత్పత్తిదారుల సంఘాలను మరింత బలోపేతం చేయడానికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. రైతులు నాణ్యమైన ఉత్పత్తులను సరసమైన ధరలకు వినియోగదారులకు అందించేందుకుగాను స్టాల్స్ ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మాణించారు. సమావేశంలో రైతు నాయకులు కొండల్ సాయారెడ్డి, వేల్పూర్ భూమయ్య, కొట్టే గంగాధర్, కిష్ణాగౌడ్, మమ్మాయి రాజన్న, పద్మ, పెంటయ్య, ఎఫ్‌పీవోల చైర్మన్లు వినయ్‌కుమార్, సిరికొండ శ్రీనివాస్, పృధ్వీరాజ్, శంకర్, హన్మాండ్లు, పుష్ప, గోపాల్ పాల్గొన్నారు.