ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు.. | - | Sakshi
Sakshi News home page

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు..

May 1 2025 12:26 AM | Updated on May 1 2025 12:26 AM

ప్రయి

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు..

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లాలోని ప్రయివేట్‌ పాఠశాలు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబర్చాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ ఒలంపియడ్‌ పాఠశాల విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించారు. ఎస్‌.క్రితి 596, నితేశ్‌ 591, అఖిల్‌ 590, డి.కృతి 587, సాయిశ్రేయస్‌ 586, జి.వర్షిణి 586, కౌశిక్‌ప్రసాద్‌ 585, సిద్ధిఖి 585, గౌతమ్‌ 585, జశ్వంత్‌ 584, అస్సాగౌర్‌ 583, ఎస్‌.భవాని 582, జె.యోచన 582, బి.అక్షర 581, కె.సహస్ర 580 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్‌ విద్యార్థుల అభినందన కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులను సన్మానించారు. పాఠశాల డైరెక్టర్‌ రామోజీరావ్‌, డైరెక్టర్‌ తేజస్విని, ప్రిన్సిపల్‌ తదితరులున్నారు. నగరంలోని రవి పబ్లిక్‌ పాఠశాల విద్యార్థులు ప్రద్నుమ 563, దీపిక 561, విఘ్నేష్‌ 560, జోషు 555, విహారిక 553, సన్నిత 552 మార్కులు సాధించారు. పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది.

విజయ్‌ పబ్లిక్‌ స్కూల్‌..

నగరంలోని ముబారక్‌నగర్‌ విజయ్‌ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థులు 188 మంది పరీక్షలకు హాజరుకాగా వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యార్థులు ఇషిత 588, యూనిస్‌ సోషన్‌ 587, తనుశ్రీ 586 మార్కులు సాధించారు.

నలంద పాఠశాల..

నలంద పాఠశాల విద్యార్థిని కె.లాస్య 559 మార్కులు సాధించింది. ఎస్‌.మనోజ్‌ 557 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల డైరెక్టర్‌ మురళీకృష్ణ అభినందించారు.

విశ్వవికాస్‌ పాఠశాల..

నగరంలోని విశ్వవికాస్‌ పాఠశాల విద్యార్థిని కె.నందిని 575 మార్కులు , సాయికృష్ణ 574, వర్షిక్‌ 564 , యశశ్వి 563, సహస్ర 551 మార్కులు సాధించారు. ఉత్తమ మార్కులు సాధించినవారిని పాఠశాల ప్రిన్సిపల్‌ సుస్మిత అభినందించారు.

విశ్వభారతి విద్యాలయం..

విశ్వభారతి పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. తేజస్వి 557 మార్కులు , ప్రవళిక 546 మార్కులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్‌ శ్యాంసుందర్‌రెడ్డి ఉత్తమ విద్యార్థులను అభినందించారు.

వాసు ఉన్నత పాఠశాల..

నగరంలోని వాసు ఉన్నత పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. శృతిక 581, వర్ష 546, నవ్య 545 మార్కులు సాధించారు. పాఠశాల కరస్పాండెంట్‌ వాసు విద్యార్థులను అభినందించారు.

సెయింట్‌ జేవియర్స్‌ పాఠశాల..

సెయింట్‌ జేవియర్స్‌ పాఠశాల విద్యార్థిని సాత్విక 581 మార్కులు సాధించింది. మనోజ్ఞ 560, శృతిక 558, మధురిమ 538 మార్కులు సాధించారు. వీరి ని పాఠశాల ప్రిన్సిపల్‌ లతాగౌడ్‌ అభినందించారు.

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు.. 1
1/4

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు..

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు.. 2
2/4

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు..

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు.. 3
3/4

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు..

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు.. 4
4/4

ప్రయివేట్‌లోనూ ఫలితాల జోరు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement