
అసమానతలు లేని సమాజం కోసం..
మోపాల్: మీనయ్య అమరత్వాన్ని స్ఫూర్తిగా తీసుకుని అసమానతలు లేని సమాజం కోసం పోరాడాలని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య పిలుపునిచ్చారు. మంగళవారం నగరశివారులోని బోర్గాం(పి)లో మండల నాయకుడు మీనయ్య సంస్మరణ సభ నిర్వహించారు. ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం యుద్ధం ప్రకటించిందని, దీనిని అందరూ ఖండించాలని కోరారు. శ్రామిక నగర్ గుడిసెవాసుల పట్టాల కోసం మీనయ్య పోరాడారని గుర్తుచేశారు. అంతకుముందు మీనయ్య చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో నాయకులు మల్లికార్జున్, నాగభూషణం, యాదన్న, పరుచూరి శ్రీధర్, నీలం సాయిబాబా, చిన్నయ్య, వనమాల సత్యం, రమేశ్, భాస్కర్, భుజేందర్, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.