
డిచ్‌పల్లిలో కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేసిన పోలీసులు.. సిరికొండ పోలీస్ స్టేషన్‌లో..
డిచ్‌పల్లి/సిరికొండ/ధర్పల్లి/నిజామాబాద్ రూరల్/మోపాల్(నిజామాబాద్‌రూరల్)/నిజామాబాద్‌నాగారం: నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో పోలీసులు మంగళవారం తెల్లవారుజామున వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నేతలు, సమ్మె నిర్వహిస్తున్న కార్మికులను ముందస్తు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లకు తరలించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్‌లో పర్యటన సందర్భంగా వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నాయకులను అక్రమంగా అరెస్ట్‌లు చేయడం సరికాదని పౌర హక్కుల సంఘం జిల్లా కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. అక్రమ అరెస్టులను ఖండించారు. అరెస్టయిన వారిని పోలీసులు మధ్యాహ్నం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.
