
డిచ్‌పల్లి: మండలంలోని బర్దిపూర్ శివారులోగల తిరుమల నర్సింగ్ కళాశాలలో ఈనెల 5న తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్), తెలంగాణలోని కార్మిక ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ, రిజిస్టర్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, వివిధ దేశాల్లో నర్సింగ్ ఉద్యోగ నియామకాలను సులభతరం చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పనాధికారి సిరిమల్ల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని నిర్దిష్ట నర్సింగ్, సంబంధిత ఉద్యోగ అవకాశాలు గురించి సమాచారాన్ని అందించడానికి వివిధ జిల్లాలో నమోదు డ్రైవ్/వర్క్‌షాపులను నిర్వహిస్తోందన్నారు. వివరాలకు 6302292450, 7893566493ను సంప్రదించాలన్నారు.
ముగిసిన పునశ్చరణ
తరగతులు
నిజామాబాద్ సిటీ: ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల దూపా, దీపా నైవేధ్యం పథకం అర్చకులకు గత మూడురోజులుగా నిర్వహించిన పునశ్చరణ తరగతులు మంగళవారం ముగిశాయి. నగరంలోని సాయిబాబా మందిరంలో గత ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉమ్మడి జిల్లాలోని 595 మంది అర్చకులకు దేవాలయాలలో ఆచరించే పూజ విధానాల పట్ల పురోహితులు, పండితులు అర్చకులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో దేవాదా య, ధర్మాదాయ సహయ కమిషనర్ ఎన్ సుప్రియ, పరిశీలకురాలు కమల, కార్యనిర్వాహణాధికారులు రాం రవీందర్‌గుప్తా, గింజుపల్లి వేణు, వోగేటి శ్రీధర్, అర్చకులు జయరాజ్ జోషి, భాష్యం కృష్ణమూర్తి, జోషి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
చిరంజీవాచార్యులుకు సన్మానం
నిజామాబాద్ సిటీ: విశ్వజ్యోతి సంక్షేమ సంఘం హైదరాబాద్ ఆధ్వర్యంలో నగరానికి చెందిన ప్రముఖ పురోహితుడు చిరంజీవాచార్యులకు మంగళవారం సన్మానం చేశారు. విశ్వజ్యోతి సంక్షేమ సంఘం 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా ఆయుష్కోమ యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో చిరంజీవాచార్యులకు ప్రధాన పురోహిత పీఠం ఇచ్చి సగౌరవంగా సత్కరించారు.
