
డిచ్‌పల్లి: రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 5న ఛలో హైదరాబాద్ మహాధర్నా కార్యక్రమం చేపట్టినట్లు తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచా యతీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్‌టీయూ) జిల్లా కార్యదర్శి జేపీ గంగాధర్ పేర్కొన్నారు. కార్మికులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్ర దం చేయాలన్నారు. మండలంలోని మెంట్రాజ్‌పల్లిలో మంగళవారం ఆయన గ్రామ పంచాయతీ కార్మికులతో కలిసి మాట్లాడారు. పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే మహాధర్నా చేపట్టామన్నారు. కార్మికులు కిరణ్, నారాయణ, గంగు, సాయి లు,శేఖర్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
ఐఎఫ్‌టీయూలో
ఎండీఎం కార్మికుల చేరిక
సిరికొండ: మండలానికి చెందిన మధ్యాహ్న భోజన (ఎండీఎం) ఏజెన్సీ కార్మికులు ఐఎఫ్‌టీయూలో చేరారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు ముత్తెన్న పాల్గొని, మాట్లాడారు. కార్మికుల హక్కుల సాధనకు ఐఎఫ్‌టీయూ ఎన్నో పోరాటాలు చేసిందని పేర్కొన్నారు. సంఘ ప్రతినిధులు సత్తెక్క, జిల్లా సహాయ కార్యదర్శి రమేష్, రాజేశ్వర్, ఎర్రన్న, రాజనర్సు, సుల్తానా, శంకర్, రాములు పాల్గొన్నారు.
నల్లబ్యాడ్జీలతో టీచర్ల నిరసన
సిరికొండ: మండలంలోని రావుట్ల ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ఏమాత్రం చర్చించకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కేవలం ఐదు శాతం మధ్యంతర భృతి ప్రకటించడాన్ని వారు ఖండించారు. స్టీరింగ్ కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.
అక్టోబర్ 3 రైతులకు చీకటిదినం
సిరికొండ: అక్టోబర్ 3 దేశంలోని రైతులకు చీకటి దినం అని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట కార్యదర్శులు దేవరాం, రామకృష్ణ అన్నారు. మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం లఖీంపూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతులకు నివాళి అర్పించారు. అనంతరం వ్యవసాయరంగ శాస్త్రవేత్త స్వామినాథన్ మృతిపట్ల సంతాపం తెలిపారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు బాబన్న, లింబాద్రి, రమేష్, అనీస్, బాల్‌రెడ్డి, కిషోర్, నరేష్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.
మోడల్ కళాశాలకు రూ.5లక్షల విరాళం
జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ కళాశాలకు రూ.5లక్షల విరాళాన్ని ఎస్‌బీఐ ప్రతినిధులు మంగళవారం అందజేశారు. అర్గుల్ మేనేజర్ సమంత, హైదరాబాద్ సర్కిల్ సీజీఎం రీజనల్ మేనేజర్ శ్రీకాంత్, ప్రిన్సిపాల్ రాజేష్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో పలువురి చేరిక
జక్రాన్‌పల్లి: మండలంలోని మునిపల్లి గ్రామానికి చెందిన యువకులు మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్‌లోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నాయకులు రాజేశ్వర్, రమేష్, హన్మంతు, దుర్గయ్య, నర్సయ్య, సురేష్, నగేష్, దశరథ్ ఉన్నారు.




