
మాట్లాడుతున్న మంత్రి సత్యవతి రాథోడ్
భీమ్‌గల్: గిరిజనుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌కే చెల్లు తుందని, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాష్ట్ర రోడ్లు భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. మండలంలో మంగళవారం రూ.2.50కోట్లతో 48 తీజ్, సేవాలాల్ భవనాల నిర్మాణాల కోసం మంజూరైన నిదుల ప్రొసీడింగ్ కాపీలను మంత్రులు అందజేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఎన్ని కుట్రలు చేసిన బీఆర్‌ఎస్ హ్యట్రిక్ విజ యం సాధించడం ఖాయమని స్పష్టం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ కన్నె ప్రేమలత, జెడ్పీటీసీ చౌట్‌పల్లి రవి, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మంత్రులు సత్యవతి రాథోడ్, ప్రశాంత్‌రెడ్డి