
సిరికొండ నుంచి వెళ్తున్న బీజేపీ నాయకులు
సిరికొండ/ధర్పల్లి: నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లోని అన్ని మండలాలు, గ్రామాల నుంచి బీజేపీ శ్రేణులు, ప్రజలు మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ సభకు తరలివెళ్లారు. స్థానిక పార్టీ నాయకులు ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేయగా, అందులో పార్టీ శ్రేణులు, ప్రజలు నిజామాబాద్‌కు వెళ్లారు.
ఉచితంగా మంచినీటి పంపిణీ
నిజామాబాద్ సిటీ: జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభకు వచ్చిన ప్రజల దాహార్తిని తీర్చేందుకు నగరానికి చెందిన మంచాల శంకరయ్య చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంచినీటిని పంపిణీ చేశారు. ట్రస్టు వ్యవస్థాపకుడు మంచాల జ్ఞానేందర్, చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు వెంకట నర్సాగౌడ్ పాల్గొన్నారు.
