
● ప్రధాని మధ్యాహ్నం 3.51 గంటల కు కలెక్టరేట్‌లోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు.
● వాయుసేనకు చెందిన మూడు హెలికాప్ట ర్లు వచ్చాయి.
● ఎంపీ అర్వింద్ ప్రసంగిస్తుండగా హెలికాప్ట ర్లు రావడంతో ప్రజలు మోదీ.. మోదీ.. నినాదాలు చేశారు.
● ప్రధాని మోదీ పలు అభివృద్ధి పనులను అధికారిక వేదిక మీదుగా వర్చువల్‌గా ప్రారంభించారు.
● మోదీ అధికారిక వేదిక నుంచి సభా ప్రాంగణానికి ఓపెన్ టాప్ జీపులో ప్రజలకు అభి వాదం చేస్తూ రాగా.. ప్రజలు పూలవర్షం కురిపించారు.
● బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్ మోదీని పసుపు కొమ్ములదండతో స న్మానించారు.
● 4.58 గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించి టన ప్రధాని మోదీ.. 42 నిమిషాలపాటు ప్రసంగించారు.
● ప్రధాని తన ప్రసంగంలో ఆరుసార్లు ‘నా కుటుంబ సభ్యుల్లారా’ అంటూ సంబోధించారు.
● వేదికపై ఉన్న రాష్ట్ర ప్రధానకార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌తోపాటు ఎంపీ అర్వింద్, డీకే అరుణతో ము చ్చటించారు.
● 5.41 గంటలకు వేదికపై నుంచి మోదీ వెళ్లిపోయారు.
● బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణతార వందన సమర్పణ చేశారు.
● నాగేశ్వర్‌రావు కళాకారుల బృందం ఆటపాటలతో సభికులను అలరించింది.
● ‘ఇందూరు గడ్డపై బీజేపీ జెండా’ పాటకు ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది.
● ప్రధానిని దగ్గరగా చూసేందుకు ప్రజలు వారికి కేటాయించిన గ్యాలరీలను తోసుకుంటూ మీడియా, వీఐపీ గ్యాలరీలోకి ప్రవేశించా రు. విధుల్లో ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేసినా.. సాధ్యంకాలేదు.
● సభావేదికపైకి బండి సంజయ్, ఈటల రాజేందర్, అర్వింద్‌లను పిలిచిన సమయంలో ప్రజలు పెద్దఎత్తున ఈలలు, కేరింతలు, చప్పట్లు కొట్టారు.
– సుభాష్‌నగర్/నిజామాబాద్ సిటీ
ప్రధానికి గవర్నర్ స్వాగతం
నిజామాబాద్‌అర్బన్: ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గవర్నర్ తమిళిసై, రాష్ట్ర ప్రభుత్వం తరఫున రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి స్వాగతం పలికారు. వారు మోదీ కి పుష్పగుచ్ఛాలు అందజేశారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు మోదీ జిల్లా కేంద్రానికి చేరుకున్నా రు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ అర్వింద్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి, సీపీ సత్య నారాయణ, ప్రజాప్రతినిధులు, నాయకులు మోదీకి స్వాగతం పలికినవారిలో ఉన్నారు.