
మాట్లాడుతున్న ఎంపీ అర్వింద్ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటన నే పథ్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో బీజేపీ నేతలు బీఆర్‌ఎస్, కేసీఆర్ కు టుంబంపై భారీ విమర్శల దాడి చేశారు. ఎంపీ అర్వింద్ మాట్లాడుతూ ఇందూరు జిల్లాకు జాతీయ పసుపుబోర్డు మంజూరు చేసిన ప్రధాని మోదీకి పాదాభివందనమని అన్నారు. కొ న్ని దశాబ్దాల రైతుల చిరకాల కోరిక పసుపు బోర్డు అన్నారు. అయితే పింకీ కుక్కలు మాత్రం పసుపు బోర్డు రాదని ప్రచారం చేశారన్నారు. పసుపు బోర్డుతో తన లక్ష్యం నెరవేరలేదన్నారు. నా అసలు లక్ష్యం ఇప్పుడే ప్రారంభమైందన్నారు. కల్వకుంట్ల కుటుంబానికి ముందుంది ముసళ్ల పండుగ అన్నా రు. ప్రధాని మోదీ గురించి మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో అవాకులు చెవాకులు పేలుతున్నాడన్నారు. కేటీఆర్ నీ బతుకెంత.. నీ లెక్కెంత అని అర్వింద్ అన్నారు. కాళేశ్వరం, పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా కావాలని అడిగే కేసీఆర్.. ఆ ప్రాజెక్టుల డీపీఆర్ కేంద్రానికి ఎందుకు ఇవ్వలేదన్నారు. డీపీఆర్ ఇస్తే కాళేశ్వరం ప్రాజెక్టులో కల్వకుంట్ల కుటుంబం అవినీతి ఎక్కడ బయట పడుతుందోనని భయపడుతున్నారన్నారు. జక్రాన్‌పల్లిలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ఎగుమతుల కోసం కేంద్రం ఎయిర్‌పోర్టు మంజూరు చేస్తే స్థలం ఇవ్వకుండా బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. కాగా డ్రగ్స్ తీసుకునే కేటీఆర్ మత్తుకు బానిసయ్యాడని ఆరోపించారు. ఇందూరు గడ్డ నుంచి వేల కోట్ల ప్రాజెక్టులు జాతికి అంకితం చేస్తున్నారన్నారు. మోదీపై ప్రజలకున్న అభిమానానికి టెంట్లు, మైదానం సరిపోవడం లేదన్నారు. గల్ఫ్ సోదరుల గోస తీర్చడం బీజేపీతోనే సాధ్యమన్నారు. బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయం కోసం విజనరీ ప్రధాని ప్రత్యేక దృష్టి సారించారన్నారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ తెరిచి మళ్లీ ఈ ప్రాంతం చెరుకు పంటతో కళకళలాడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటు బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు.
● కేసీఆర్ కుటుంబానికి ఎంపీ
ధర్మపురి అర్వింద్ హెచ్చరిక
● అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ :
కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
● నిజామాబాద్ సభలో బీజేపీ నేతల విమర్శల దాడి
మోదీ ప్రధాని అయ్యాకే విద్యుత్ సమస్య పరిష్కారం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ భారత్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. 2014కు ముందు భారతదేశంలో విద్యుత్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలి డేస్ ఉండేవి. మోదీ ప్రధాని అయ్యాక విద్యుత్ సమస్య పరిష్కరించారన్నారు. ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 800 మెగావాట్ల సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రజలు, రైతులు, పారిశ్రామిక రంగానికి అంకితం చేశారన్నారు. ఆయుష్మాన్ భారత్, నేషనల్ హెల్త్ మిషన్ కింద ఆరోగ్యరంగంలో విశేష సేవలు అందిస్తున్నారన్నారు. కరోనాను భారత్ సమర్థంగా ఎదుర్కొన్నది. 140 కోట్ల మంది దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సినేషన్ ఇచ్చి మోదీ ప్రాణాలు కాపాడాడన్నారు. 84 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందిస్తున్న ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే అన్నారు. అనేక సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పసు పుబోర్డును సాకారం చేసి రైతుల సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారన్నారు.
