మోదీ.. మోదీ.. | - | Sakshi
Sakshi News home page

మోదీ.. మోదీ..

Oct 4 2023 2:26 AM | Updated on Oct 4 2023 2:26 AM

- - Sakshi

● నీరాజనం : వేదిక వద్దకు కాన్వాయ్‌పై వస్తున్న ప్రధాని మోదీకి ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రజలు

ఇందూరు కాషాయ వర్ణశోభితమైంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాతోపాటు నిర్మల్‌, జగిత్యాల జిల్లాలనుంచి తరలివచ్చిన పార్టీ శ్రేణులు, రైతులతో నగరం జనసంద్రంలా కనిపించింది. నమో నామ జపంతో సభా ప్రాంగణం దద్దరిల్లింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇందూరు పర్యటన విజయవంతం కావడంతో బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉరకలెత్తుతోంది.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని ప్రభుత్వ గిరిరాజ్‌ కళాశాల మైదానంలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభ.. ఆ పార్టీ కి నయా జోష్‌ తెచ్చింది. అంచనాలకు మించి జనం తరలిరావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఉత్తర తెలంగాణ ప్రజల చిరకాల కోరిక అయిన పసుపు బోర్డును ప్రకటిస్తూ మోదీ ఇందూరుకు రావడంతో సభకు రైతులు భారీగా తరలివచ్చారు. బహిరంగ సభ ప్రారంభం కాగానే రైతులు ప్రధానిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. పసుపు కొమ్ములతో చేసిన దండను ప్రధానికి వేశారు. ప్రధానమంత్రి సభాప్రాంగణంలోకి అడుగు పెట్టిన క్షణం నుంచి జనం మోదీ మోదీ అంటూ హోరెత్తించారు. సాయంత్రం 4.59 గంటలకు ప్రసంగం ప్రారంభించిన మోదీ.. 5.40 గంటల వరకు మాట్లాడారు. ప్రధాని మాట్లాడినంత సేపు ప్రజలు ఈలలు, కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురించి మోదీ విమర్శలు చేస్తున్న సమయంలో సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇంతకాలం పసుపు బోర్డు అంశంపై బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తూ వచ్చింది. పలుసార్లు ఘర్షణలు సైతం చోటుచేసుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఊహించని రీతిలో కేంద్ర ప్రభుత్వం పసుపు బోర్డు ప్రకటించడం, ప్రధాని మోదీ జిల్లాకు రావడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తర తెలంగాణపై గురి పెట్టిన బీజేపీ అందుకు ఇందూరు సభను వేదికగా చేసుకుని పోరు మొదలుపెట్టడం గమనార్హం.

కేసీఆర్‌ను మించిన అబద్ధాలకోరు తెలంగాణలో మరొకరు లేరని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ అన్నారు. పసుపు బోర్డు ఇస్తే అభ్యర్థిని పెట్టబోనని చెప్పిన బీఆర్‌ఎస్‌ ఏం ముఖం పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేస్తుందో చెప్పాలన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కట్టించే సత్తా కేసీఆర్‌ ప్రభుత్వానికి లేదన్నారు. కుటుంబంలో ఇద్దరికి పింఛన్‌ ఇస్తామని, మాట ఇస్తే తప్పని పార్టీ బీజేపీ, మోదీ అన్నారు. పసుపు బోర్డు హామీ నెరవేర్చడం నిదర్శనమన్నారు. గల్ఫ్‌ పాలసీ అమలు చేస్తామన్న బీఆర్‌ఎస్‌ మోసం చేసిందన్నారు. హైదరాబాద్‌ శివార్లలో భూములు అ మ్మేసి, మద్యం టెండర్లు ముందుగానే పెట్టి రూ.13వేల కోట్లు సేకరించినప్పటికీ రుణమాఫీ చేయలేదన్నారు.

జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితిలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు రూ. 74వేల కోట్లు అప్పులుండగా, ఇప్పుడు రూ.5.5లక్షల కోట్లకు పెరిగాయన్నారు.

ప్రధాని మోదీ సభకు

భారీ బందోబస్తు

సభాస్థలికి తరలివచ్చిన రైతులు, బీజేపీ కార్యకర్తలు

ఖలీల్‌వాడి: ఇందూరు జనగర్జన అణువణువు నా నిఘానీడలో కొనసాగింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సమీకృత కలెక్టరేట్‌ ప్రాంగణంలోని హెలీప్యాడ్‌ వద్ద, అక్కడి నుంచి గిరిరాజ్‌కళాశాల వరకు రోడ్డువెంబడి పోలీసులు మోహరించారు. అభివృద్ధి పనులను వర్చువల్‌గా మోదీ ప్రారంభించగా, ఆ ప్రాంగణానికి రైల్వే, ఎన్టీపీసీ, విద్యుత్‌, డాక్టర్లను మాత్రమే అనుమతించారు. వర్చువల్‌ సభా వేదిక నుంచి బహిరంగసభ వేదిక వద్దకు మోదీ ఓపెన్‌టాప్‌ జీపులో వచ్చేసమయంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేశారు. జీపుకు రెండుపక్కల ఎస్‌పీజీ, స్థానిక పోలీసులున్నారు. రెడ్‌జోన్‌ పరిధిలోకి నేషనల్‌ సెక్యూరిటీ పోలీసులు ఎవరినీ అనుమతించలేదు. సభ ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.

అడుగడుగున పోలీసులు

సీపీ సత్యనారాయణతోపాటు ఐదుగురు ఎస్పీ లు, ఇద్దరు బెటాలియన్‌ కమాండెంట్లు, 13 మంది అదనపు ఎస్పీలు, 13 మంది ఏసీపీలు, 107 మంది సీఐలు, 200 మంది ఎస్సైలు 1900 వేల మంది ఏఎస్సైలు, హెడ్‌ కాని స్టేబు ళ్లు, కానిస్టేబుళ్లు, మహిళ కానిస్టేబుళ్లు బందోబస్తులో పాల్గొన్నారు. సీసీ కెమెరాలతో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. 12 జిల్లాల నుంచి వచ్చిన పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు.

సుభాష్‌నగర్‌: పసుపు బోర్డు వచ్చే వరకు చెప్పులు వేసుకోబోనని శపథం చేసిన వ్యక్తి పేరేమిటని ప్రధాని మోదీ ముత్యాల మనోహర్‌రెడ్డి గురించి ఆరాతీసినట్లు తెలిసింది. కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌తో మాట్లాడిన మోదీ.. పసుపుబోర్డు కోసం 12ఏళ్లపాటు చెప్పులు లేకుండా తిరిగిన వ్యక్తి ఎవరని ఆరా తీయగా.. ఆయన పేరు ముత్యాల మనోహర్‌రెడ్డి అని, 2011 నవంబర్‌ 4నుంచి చెప్పులు లేకుండా తిరుగుతున్నారని సంజయ్‌ చెప్పినట్లు సమాచారం. మనోహర్‌రెడ్డి లక్ష్యం నెరవేరిందని, నా తరఫున ఆయనకు అభినందనలు చెప్పాలని బండి సంజయ్‌కి మోదీ సూచించినట్లు తెలిసింది. మనోహర్‌రెడ్డిని మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి మురళీధర్‌రావు సన్మానించారు. ఆయనవెంట గోదావరి హారతిప్రతినిధులు వేణుగోపాల్‌, ఆర్‌ తిరుపతి ఉన్నారు.

కేసీఆర్‌ను మించిన అబద్ధాలకోరు లేరు

ఆయన పేరేంటి?

ముత్యాల మనోహర్‌రెడ్డి

గురించి ఆరా తీసిన మోదీ

బీజేపీలో నయా జోష్‌

స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు,

మహిళలు

నమో నామ జపంతో ఉర్రూతలూగిన సభాప్రాంగణం

కేసీఆర్‌ కుటుంబంపై మోదీ

విమర్శలకు విశేష స్పందన

ప్రధాని ఇందూరు పర్యటన

విజయవంతం

సభకు తరలివస్తున్న మహిళా కార్యకర్తలు1
1/7

సభకు తరలివస్తున్న మహిళా కార్యకర్తలు

2
2/7

3
3/7

4
4/7

5
5/7

మనోహర్‌రెడ్డిని సన్మానిస్తున్న మురళీధర్‌రావు6
6/7

మనోహర్‌రెడ్డిని సన్మానిస్తున్న మురళీధర్‌రావు

నిఘానీడలో ‘గర్జన’7
7/7

నిఘానీడలో ‘గర్జన’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement