
సుభాష్‌నగర్: ఇందూరు జనగర్జన సభ ముగిసిన అనంతరం కరీంనగర్ వెళ్తున్న బండి సంజయ్‌కు దారి పొడవునా కార్యకర్తలు నీరాజనం పలికారు. సంజయ్ వాహనాన్ని చుట్టుముట్టి హిందూ టైగర్ బండి సంజయ్.. జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. దీంతో కంఠేశ్వర్ బైపాస్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆయన వాహనానికి దారి చూపడంతో కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్లిపోయారు. కాగా బహిరంగ సభ వేదికపైకి ఆహ్వానించే సమయంలోనూ బండి సంజయ్ పేరు పలకగానే ప్రజలు ఈలలు, కేకలు వేశారు.