
నిజామాబాద్ సిటీ: దేశంలో అవినీతి లేని పాలనకు దేశ ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారు. ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని దేశాన్ని పాలిస్తున్న విధానం మూడోసారి మోదీని ప్రజలు ప్రధానిగా చూడాలనుకుంటున్నారు. పసుపు బోర్డు తీసుకొస్తానని ఎంపీ అర్వింద్ హామీ ఇచ్చి సాధించారు. అంతేకాకుండా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుతో వారికి ఎంతో మేలు కలుగుతుంది. మోదీ దేశంలో జాతీయ రహదారుల అభివృద్ధి, రైల్వేస్టేషన్లను విమానాశ్రయం లాగా అభివృద్ధి చేస్తున్నారు.
– బస్వా లక్ష్మీనర్సయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు