
వర్ని: బడాపహాడ్‌లో మొక్కులు చెల్లించేందుకు వచ్చిన ఒకరు విద్యుదాఘాతంతో మృతి చెందినట్లు ఎస్సై కృష్ణకుమార్ తెలిపారు. మెదక్ జిల్లా శంకరంపేట్‌కు చెందిన అవదగిరి పోచయ్య(36) బడాపహాడ్ పుణ్యక్షేత్రంలో మొక్కలు తీర్చుకునేందుకు మంగళవారం వచ్చాడు. అద్దెకు తీసుకున్న రూములో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
కడుపునొప్పితో ఒకరి ఆత్మహత్య
తాడ్వాయి(ఎల్లారెడ్డి): మండలంలోని చందాపూర్‌కు చెందిన అల్లూరి నర్సారెడ్డి (35)కడుపునొప్పి భరించలేక ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఆంజనేయులు మంగళవారం తెలిపారు. ఆసుపత్రుల్లో చూయించినా నయం కాకపోవడంతో తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
