
బాల్కొండ: మండల కేంద్రంలో జిల్లా స్థాయి అండర్–14, అండర్–17 ఎస్‌జీఎఫ్ కబడ్డీ, ఖోఖో పోటీలను ఎంపీపీ లావణ్య మంగళవారం ప్రారంభించారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్ సంఘం జిల్లా అధ్యక్షుడు సంగీత్‌రావు, ఎంఈవో రాజేశ్వర్, క్రీడల నిర్వహణ కార్యదర్శి జైడి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీని కలిసిన
భాషాపండితులు
నిజామాబాద్‌అర్బన్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సభ్యులు హైదరాబాద్‌లో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పదోన్నతులపై చర్చించారు. ఎమ్మెల్సీని కలిసిన వారిలో జిల్లా శాఖ అధ్యక్షుడు జమీలుల్ల, రమణాచారి, కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
ఎన్టీపీసీ చైర్మన్‌ను కలిసిన అధికారులు
నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రధాని మోదీ కార్యక్రమానికి హాజరైన ఎన్టీపీసీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గురుదీప్‌సింగ్‌ను జిల్లా విద్యుత్ అధికారులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఎన్‌పీడీసీఎల్ సీఎండీ గోపాల్‌రావు ఆదేశాల మేరకు డైరెక్టర్ మోహన్‌రెడ్డి, గణపతి ఆధ్వర్యంలో చైర్మన్‌ను కలిసి సన్మానించినట్లు అధికారులు తెలిపారు. చైర్మన్‌ను కలిసిన వారిలో ఎస్‌ఈ రవీందర్, డీఈలు రాజేశ్వర్‌రావు, శ్రీనివాస్‌రావు, వెంకటరమణ, హరిచంద్‌నాయక్, ఏడీఈలు తోట రాజశేఖర్, అనూప్‌కుమార్, అశోక్, వెంకటనారాయణ, చంద్రశేఖర్, నగేశ్ తదితరులు ఉన్నారు.
