
పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరిస్తున్న గవర్నర్ తమిళిసై
● గవర్నర్‌కు స్వాగతం పలికిన
ఆర్డీవో, మైనార్టీ వెల్ఫేర్ అధికారిణి
● కనిపించని కలెక్టర్,
ఇతర ఉన్నతాధికారులు
ఖలీల్‌వాడి: తెలంగాణలో పలు అభివృద్ధి పనులను వర్చువల్‌గా ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్రమోదీ జిల్లా కేంద్రానికి రాగా, గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ హాజరయ్యారు. అయితే బహిరంగసభలో పాల్గొనేందుకు వచ్చిన గవర్నర్‌కు స్వాగతం పలకడంలో ప్రొటోకాల్ ఉల్లంఘన అంశం సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లాకు చెందిన పోలీసులు కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా సరిహద్దు గ్రామమైన దగ్గి నుంచి గవర్నర్‌ను ఎస్కార్ట్‌తో తీసుకురాగా, నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు. అనంతరం గవర్నర్‌కు ఆర్డీవో వినోద్‌కుమార్, మైనార్టీ వెల్ఫేర్ అధికారిణి కృష్ణవేణి స్వాగతం పలికారు. కలెక్టర్ లేదా అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ స్వాగతం పలకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న గవర్నర్‌కు అధికారులు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానం పలకాల్సి ఉండగా, ప్రజాప్రతినిధులతో ఇబ్బందులు వస్తాయని భావించి అధికారులు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది. గవర్నర్‌కు స్వాగతం పలికిన వారిలో రెడ్‌క్రాస్ సభ్యులు ఆంజనేయులు, రాజశేఖర్, డీఎంహెచ్‌వో వైద్యులు నవీన్, సామ్రాట్, ప్రకాశ్ ఉన్నారు.

మొక్కను అందజేస్తున్న ఆర్డీవో వినోద్‌కుమార్