
మూడు దశాబ్దాల కల పసుపు బోర్డు నెరవేరింది. దీని వెనుక ఎంపీ అర్వింద్ కృషి ఎంతో ఉంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పసుపుబోర్డు ఏర్పాటుపై కీలకపాత్ర పోషించారు. గతంలో ఎంపీ, ఎమ్మెల్యేగా పనిచేసిన వారు పసుపుబోర్డుపై రైతులను మభ్యపెట్టారు. ప్రధాని మోదీ జాతీయ రహదారులను అభివృద్ధి చేయడంతో ప్రయాణాలు సులభంగా మారాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేశారే తప్పా అభివృద్ధి చేయలేదు. ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్‌ను నమ్మి మోసపోవద్దు. – పల్లె గంగారెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి