
ఫ్యాక్టరీ నూతన సిబ్బందికి నియామక పత్రాలు అందజేస్తున్న నాయకులు
నిజామాబాద్ రూరల్: చెరుకు రైతులకు అండగా ఉంటామని, చక్కెర కర్మాగారాన్ని మళ్లీ ప్రారంభిస్తామని సారంగాపూర్ చక్కెర కర్మాగార పరిరక్షణ కమిటీ చెర్మన్ కొండెల సాయిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం గాంధీజీ, లాల్ బహుదూర్‌శాస్త్రిల జయంతులను పురస్కరించుకొని వారి చిత్రపటాలకు పూలమాల వేసి, నివాళ్ళుఅర్పించారు. అనంతరం చక్కర కర్మగారంలో నూతనంగా ఉద్యోగులకు నియామకపత్రాలు అందజేశారు. చక్కర కర్మాగార మేనేజింగ్ డైరెక్టర్‌గా రవీంధర్ బాబు, అగ్రికల్చర్ ఆఫీసర్‌గా సురేంధర్, చీఫ్ ఇంజనీర్‌గా భూమేశ్వర్, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్‌గా అనిల్ కులకర్ణి, పౌర సంబంధాల అధికారిగా సాయినాథ్‌రెడ్డిని నియమించినట్లు చక్కెర కర్మాగార పరిరక్షణ కమిటీ అధ్యక్షుడు సాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సత్వర చర్యలు చేపడితే చక్కెర కర్మాగారాన్ని ప్రారంభిస్తామని అన్నారు. అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు అండగా ఉండాలని కోరారు. కమిటీ డైరెక్టర్లు, పాలకవర్గ సభ్యులు, అఽధికారులు పాల్గొన్నారు.