
విజేత జట్లకు బహుమతులు అందజేస్తున్న బీఆర్‌ఎస్ నాయకుడు రాజేశ్వర్‌రెడ్డి
ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ఆల్‌ఫోర్స్ నరేంద్ర హైస్కూల్‌లో కొనసాగుతున్న రాష్ట్రస్థాయి 42వ సబ్–జూనియర్ బాల్ బాడ్మింటర్ బాల బాలికల క్రీడా పోటీలు సోమవారం ముగిశాయి. ఈ సందర్భంగా జిల్లా బాల్ బాడ్మింటర్ సంఘం అధ్యక్షుడు మానస గణేశ్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నాయకుడు ఆశన్నగారి రాజేశ్వర్‌రెడ్డి హాజరై మాట్లాడారు. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని అన్నారు. అనంతరం బాలుర విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జట్లు, బాలికల విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన ఖమ్మం, నిజామాబాద్, మెదక్ జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్మూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు విద్యాసాగర్‌రెడ్డి, టీఎస్‌పీఈటీఏ జిల్లా కోశాధికారి రాజేందర్, రాజేశ్వర్, కృష్ణమూర్తి, సురేందర్, గట్టడి రాజేశ్, కౌన్సిలర్ బారాడ్ రమేకశ్, ప్రసాద్, హనుమంతు, నాయకులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.