
తిర్మన్‌పల్లిలో కేజీబీవీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
ఇందల్వాయి: రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలు ప్రజలు నమ్మి మోసపోవద్దని అన్నారు. అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఉండాలని సూచించారు. దళితబంధు విషయమై సిర్నాపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటనను అడ్డుకునేందుకు పెద్ద సంఖ్యలో దళితులు రోడ్డెక్కారు. పోలీసులు వారిని అదుపులో ఉంచారు. డీసీఎంఎస్ చైర్మన్ సంబరి మోహన్, జెడ్పీటీసీ సుమనరెడ్డి, ఎంపీపీ రమేష్ నాయక్, వైస్ ఎంపీపీ అంజయ్య, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దాసు, పీఏసీఎస్ చైర్మన్ గోవర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేకు మద్దతుగా తీర్మానం
డిచ్‌పల్లి: నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌కు వచ్చే ఎన్నికల్లో మద్దతు తెలుపుతున్నట్లు మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన శాలివాహన కుమ్మరి సంఘం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈమేరకు సోమవారం ఎమ్మెల్యేను కలిసి, తీర్మానప్రతిని అందజేశారు. సంఘ అధ్యక్ష, కార్యదర్శులు పోతుగంటి గంగాధర్, పెద్ద భూమన్న, సర్పంచ్ పాపాయి తిరుపతి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్‌లో చేరికలు
సిరికొండ: మండలంలోని కొండాపూర్ గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు సోమవారం ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచ్ రమేష్, సొసైటీ వైస్ చైర్మన్ అబ్బాస్, ఉప సర్పంచ్ సుమన్, రవి, నర్సయ్య, జగన్, సంతోష్ పాల్గొన్నారు.
ఆర్టీసీ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే
బాజిరెడ్డి గోవర్ధన్
గ్రామాల్లో అభివృద్ధి పనులు ప్రారంభం