
ఈ – పంచాయతీ ఆపరేటర్ల సంఘం ఆధ్వర్యంలో..
ధర్పల్లి: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో సోమవారం ఆశ కార్యకర్తలు తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి అందించారు. ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆశా కార్యకర్తలు కోరారు.
ఎండీఎం కార్మికుల ఆధ్వర్యంలో..
ఖలీల్‌వాడి: నగరంలోని గాంధీజీ విగ్రహానికి సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం (ఎండీఎం) కార్మికులు తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు కనీస వేతనం రూ.20 వేలు ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో..
నిజామాబాద్‌నాగారం: దేశంలో జర్నలిజం రక్షణకు, జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని టీయూడబ్ల్యూజే– ఐజేయూ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు వారు సోమవారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు.
ఈ–పంచాయతీ ఆపరేటర్ల ఆధ్వర్యంలో..
సుభాష్‌నగర్: తమ సమస్యలను పరిష్కరించాలని జిల్లాలో ప్రాజెక్ట్ మేనేజర్లు, ఈ–పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు చేపట్టిన సమ్మె సోమవారం నాలుగో రోజుకు చేరింది. ఈసందర్భంగా వారు గాంధీ, శాస్త్రి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి, వినతిపత్రాలు సమర్పించి, నిరసన తెలియజేశారు.

ధర్పల్లిలో గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న ఆశా కార్యకర్తలు

టీయూడబ్ల్యూజే– ఐజేయూ ఆధ్వర్యంలో..