
నిజామాబాద్ అర్బన్, రూరల్ నియోజకవర్గాల్లో సోమవారంస్వాతంత్య్ర సమరయోధుడు, భారత జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రిల జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో వారి విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్య్రం కోసం వారు చేసిన పోరాటాన్ని వక్తలు గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ, శాసీ్త్రలను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. భారత దేశానికి వారు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు.
– సాక్షి నెట్‌వర్క్
