
నిజామాబాద్ సిటీ: మాధవనగర్ సాయిబాబా ఆలయంలో దూపా, దీపా నైవేద్యం ఉమ్మడి జిల్లా అర్చకులకు ఆలయాల్లో ఆచరించే పూజ విధానాలపై నిర్వహిస్తున్న పునశ్చరణ తరగతులు సోమవారం రెండోరోజు కొనసాగింది. వీరశైవ ఆగమం, శైవ ఆగమం అర్చకులకు తరగతులు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ పరిశీలకురాలు బి. కమల, కార్యనిర్వాహణాధికారులు రాం రవీందర్ గుప్తా, పి. ప్రభు రాంచంద్రం, వోగేటి శ్రీధర్, అర్చకులు జయరాజ్ జోషి, మల్లిఖార్జున స్వామి, డిప్యూటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
నిఖత్‌కు ఎమ్మెల్సీ
కవిత అభినందన
నిజామాబాద్‌నాగారం: బాక్సింగ్‌లో క్యాంస పతకం సాధించిన తెలంగాణకు చెందిన నిఖత్‌జరీన్‌కు ఎమ్మెల్సీ కవిత ట్విటర్ ద్వారా సోమవారం అభినందనలు తెలిపారు. నిఖత్ ఆసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పోరాడి క్యాంసపతకాన్ని సాధించింది. అలాగే ఒలంపిక్‌కు అర్హత సాధించడంపై రాష్ట్రం తరపున ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఉన్నత శిఖరాలు అధిరోహించాలని తెలిపారు.
పీఎం మోదీ సభకు
తరలిరావాలి
సుభాష్‌నగర్: నగరంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో మంగళవారం జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఇందూరు జన గర్జన’ సభకు తరలిరావాలని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి స్వామి యాదవ్ కోరారు. ఈమేరకు సోమవారం ఆయన నగరంలో బీసీ కులాల వృత్తులు, విశ్వబ్రాహ్మణులు, తదితర సంఘాల ప్రతినిధులను కలిసి ఆహ్వానపత్రాలు అందజేశారు. అలాగే పూసలగల్లి క్లాత్ మర్చంట్ అసోసియేషన్ సభ్యులతోపాటు వాకర్స్, చాయ్ హోటల్ నిర్వాహకులను కలిసి నగర మాజీ అధ్యక్షుడు యెండల సుధాకర్ ప్రచారం నిర్వహించారు. నాయకులు గజం ఎల్లప్ప, నాగరాజు, రవికుమార్, సుందర్ సింగ్ రాథోడ్, మారుతి, గిరిబాబు, శ్రీనివాస్, రాము పాల్గొన్నారు.
జీపీ సిబ్బందికి సన్మానం
మోపాల్(నిజామాబాద్‌రూరల్): మండలంలో సోమవారం మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి మోదీ పిలుపు మేరకు పంచాయతీ సిబ్బందిని బీజేపీ నాయకులు స న్మానించారు. అంతకుముందు వారి కాళ్లు కడి గి శుభ్రం చేశారు. అలాగే మహాత్మాగాంధీ, లా ల్ బహదూర్‌శాస్త్రి జయంతి ఉత్సవాలను ని ర్వహించారు. మండల అధ్యక్షుడు ద్యాప రవికుమార్ వార్డుసభ్యులు, నాయకులు నవీన్‌రెడ్డి, సర్పంచ్ సిద్ధార్థ, వీడీసీ అధ్యక్షుడు నవీన్, ఉపసర్పంచ్ జగదీష్, సాయిరాం ఉన్నారు.
ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి
నిజామాబాద్‌అర్బన్: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ప్రమోద్ డిమాండ్ చేశారు. నగరంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిజామాబాద్‌లో జరిగే ఇందుర్ జనగర్జన సభలో మోదీ వర్గీకరణ గురించి మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నా రు. నాయకురాలు పెద్దోళ్ల యమున, నాగం రాజేష్, రోడ్డ ప్రవీణ్, ఆకారం రమేష్, మందర్ణ మారుతి, సుధ, భూరే శంకర్ పాల్గొన్నారు.
నిజామాబాద్‌నాగారం: కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేణికుంట నాంపల్లి తెలిపారు. సోమవారం నగరంలోని వినాయక్‌నగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. నాయకు లు సల్లూరి శ్రీనివాస్, మోహన్, మోతే భూమ న్న, చిన్న సాయిలు, తెడ్డు సాయిలు, గంగమని, కిరణ్, సంజీవ్ తదితరులు పాల్గొన్నారు.
నవోదయ, సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేయాలి
నిజామాబాద్‌అర్బన్: జిల్లాకు జవహర్ నవోదయ, రాష్ట్రంలో సైనిక్ పాఠశాలను ఏర్పాటు చేయాలని పీడీఎస్‌యూ జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్ డిమాండ్ చేశారు. నగరంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్న పీఎం మోదీ, రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాయకులు గణేష్, తిరుమలేష్, మహేష్ రాజే ష్, ప్రసాద్, హరికృష్ణ పాల్గొన్నారు.
నిరంతర విద్యుత్ అందించాలి
ఇందల్వాయి: సిర్నాపల్లి సబ్‌స్టేషన్ నుంచి గ్రామానికి నిరంతరాయంగా సింగిల్ ఫేస్ కరెంట్ సరఫరా చేయాలని గ్రామస్తులు డి మాండ్ చేశారు. ఈమేరకు సోమవారం వారు ట్రాన్స్‌కో సిబ్బందిని నిలదీశారు. నెల రోజులుగా సమస్యను విన్నవిస్తున్నా ఏఈ పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు. సర్పంచ్ విజయ్, ఉప సర్పంచ్ నవీన్ గౌడ్ తదితరులు ఉన్నారు.