
సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామ పరిధిలోని అటవీ ప్రాంతంలో భూమిని సాగు చేసుకోవడం కోసం చెట్లను నరికి వేశారని సర్పంచ్ కన్క శ్రీనివాస్ తెలిపారు. సుమారు యాభై ఎకరాల్లో పంటలు పండించడానికి చెట్లను నరికివేసి చదును చేయడానికి సన్నాహలు చేస్తున్నారని తెలిపారు. అటవీ అధికారుల నిర్లక్ష్యం వల్లనే అక్రమార్కులు అడవులను నరికి వేస్తున్నారని గ్రామస్తులు వాపోయారు. నరికేసిన చెట్లను వారు పరిశీలించారు. నరికేసిన చెట్లని ఇప్పటివి కావని అటవీ అధికారులు చెప్పడం గమనార్హం. స్థానిక అటవీ సిబ్బందిపై సిరికొండ ఎఫ్‌ఆర్వో ఎంవీ నాయక్‌కు సర్పంచ్, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.