
వినాయకుడికి ప్రత్యేక పూజలు
నిజామాబాద్ సిటీ: నగరంలోని వినాయక ఆలయాల్లో సోమవారం సంకష్టహర చతుర్థి సందర్బంగా భక్తులు ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం నిర్వహించారు. అలాగే నగర శివారులోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయానికి సోమవారం శృంగేరి శివగంగ పీఠాధిపతి పురుషోత్తమ భారతి స్వామి విచ్చేశారు. ఆలయంలో సంకష్టహర చతుర్థి పూజలు నిర్వహించారు. నేడు ఆలయంలో మహాగణపతికి స్వామివారు ప్రత్యేక అభిషేకం చేయనున్నారు. ఆలయ వ్యవస్థాపకుడు అరుణ్ శర్మ, ఆలయ అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మికం