
గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తున్న కలెక్టర్
సుభాష్‌నగర్: గాంధేయ మార్గం అందరికీ ఆదర్శం, అనుసరణీయమని కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, నగర మేయర్ దండు నీతూకిరణ్ అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని గాంధీచౌక్‌లో ఉన్న ఆయన విగ్రహానికి సోమవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఇరువురూ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. జాతిపిత చూపిన బాటలో పయనిస్తూ దేశాభ్యున్నతికి, సమాజహితానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నగర మే యర్ దండు నీతూకిరణ్, అదనపు కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ మకరంద్, అధికారులు, ఆయా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు