ప్రధాని సభకు భారీ బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

ప్రధాని సభకు భారీ బందోబస్తు

Oct 3 2023 1:06 AM | Updated on Oct 3 2023 1:06 AM

- - Sakshi

ఖలీల్‌వాడి: ప్రధానమంత్రి నరేంద్రమోదీ జి ల్లా కేంద్రానికి మంగళవారం రానున్న నేపథ్యంలో పోలీసులు అడుగడుగునా బందో బస్తు ఏర్పాటు చేశారు. గిరిరాజ్‌ కాలేజీ మైదానాన్ని ఎస్పీజీ, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ తమ ఆధీ నంలోకి తీసుకున్నాయి. ఎస్పీజీ, ఎన్‌హెచ్‌జీ ఐజీ, డీఐజీ, ఎస్పీ స్థాయి అధికారులు బందోబస్తును ప ర్యవేక్షిస్తున్నారు. నూతన కలెక్టరేట్‌ సమీకృత భవ నం నుంచి వాయుసేనకు చెందిన రెండు హెలికాప్టర్లు ఏరియల్‌ సర్వే నిర్వహించాయి. కలెక్టరేట్‌ నుంచి మూడు కిలోమీటర్ల పరిసరాలను తనిఖీ చేశారు. 30 డాగ్‌స్క్వాడ్లు తనిఖీల్లో భాగమయ్యాయి.

2,500 మంది పోలీసులు

బందోబస్తు విధుల కోసం 12 జిల్లాల నుంచి పోలీసులు జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి సీపీ సత్యనారాయణతో మాట్లాడి బందోబస్తు వివరాలను తెలుసుకున్నారు. జీజీ కళాశాల గ్రౌండ్‌బయటి ప్రాంతం జిల్లా పోలీసుల ఆధీనంలో ఉంది. నూతన సమీకృత కలెక్టరేట్‌ నుంచి సభాప్రాంగణం వరకు ఉన్న 3 కిలోమీటర్ల పరిధిలో 2 వేల 500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నా రు. ఐదుగురు ఎస్పీలు, ఇద్దరు బెటాలియన్‌ కమాండెంట్లు, పదమూడు మంది అదనపు ఎస్పీలు, 13 మంది ఏసీపీలతోపాటు 107మంది సీఐలు, 200 మంది ఎస్సైలు, 1900 మంది సిబ్బంది బందోబస్తులో పాల్గొంటున్నారు. ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు వీఐపీ, వీవీఐపీలనూ క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించనున్నారు. 20 రకాల ఐడీ కార్డులను అధికారిక, అనధికారిక సిబ్బందికి అందజేశారు.

డ్రోన్‌లకు అనుమతి లేదు..

ప్రధాన మంత్రి పర్యటన పూర్తయ్యేంత వరకు డ్రోన్‌లకు అనుమతిలేదు. ఎవరైనా డ్రోన్‌లను వినియోగిస్తే కూల్చివేయడంతోపాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సత్యనారాయణ హెచ్చరించారు. కలెక్టరేట్‌ నుంచి సభాస్థలి వరకు ఎలాంటి వాహనాలను అనుతించేది లేదన్నారు.

ఎస్‌పీజీ, ఎన్‌ఎస్‌జీ

ఆధీనంలోకి సభాస్థలి

నో ఫ్లయింగ్‌జోన్‌గా జీజీకాలేజీ ప్రాంతం

నిఘా నీడలో ఇందూరు జనగర్జనసభ

ట్రాఫిక్‌ ఆంక్షలు

ఆర్మూర్‌, నిర్మల్‌, ఆదిలాబాద్‌, మెట్‌పల్లి, జగిత్యాల, కరీంనగర్‌, కామారెడ్డి, మెదక్‌వైపు నుంచి వచ్చే వాహనాలు కంఠేశ్వర్‌ బైపాస్‌లో ప్రజలను దింపాలి. ఉమెన్స్‌ కాలేజీ, పాలిటెక్నిక్‌గ్రౌండ్‌(ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌), సీఎస్‌ఐ కళాశాలలో వాహనాలను పార్కింగ్‌ చేయాలి.

బాన్సువాడ, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్‌, జుక్క ల్‌, బోధన్‌, భైంసా, ముథోల్‌ వైపునుంచి సభకు వచ్చే వాహనాలను అర్సపల్లి, రైల్వేగేట్‌, ఖానాపూర్‌ చౌరస్తాలో ప్రజలను దింపిన తరువాత, శ్రద్ధానంద్‌ గంజ్‌(కిసాన్‌గంజ్‌)లో వాహనాలను పార్కింగ్‌ చేయాలి.

వీఐపీలు గిరిరాజ్‌కళాశాల సమీపంలోని హనుమాన్‌ మందిరం వెనుక ప్రాంతంలో, వీవీఐపీలు ముందు ప్రాంతంలో వాహనాలను పార్కింగ్‌ చేయాలి.

గిరిరాజ్‌ కళాశాల మైదానంలో ప్రధాని పాల్గొనే సభా వేదిక బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు 1
1/2

గిరిరాజ్‌ కళాశాల మైదానంలో ప్రధాని పాల్గొనే సభా వేదిక బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement