
డొంకేశ్వర్(ఆర్మూర్): గంగపుత్రులను కాదని ఇతర కులాల వారికి సొసైటీలో సభ్యత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తున్న జిల్లా మత్స్య శాఖ అధికారి రాజనర్సయ్యపై చర్యలు తీసుకోవాలని గంగపుత్ర సంఘాల నాయకులు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో వినోద్ కుమార్, అన్నయ్య, రవి, ఆనంద్ తదితరులు ఉన్నారు.
రూరల్ కానిస్టేబుల్ సస్పెన్షన్
ఖలీల్‌వాడి/ నిజామాబాద్ రూరల్: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రూరల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఎ.వరప్రసాద్‌పై చర్యలు తీసుకున్నట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. ప్రధా ని మోదీ పర్యటనకు జిల్లా కేంద్రంలోని శ్రీ రామ గార్డెన్స్‌కు ఇతర జిల్లాల నుంచి వచ్చి న పోలీసు సిబ్బందికి లైజనింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. సదరు కానిస్టేబుల్ విధులకు గైర్హాజరై దగ్గరలోని వైన్స్ షాప్‌లో మద్యం సేవించి కొంత మందితో గొడవకు దిగినట్లు చెప్పారు. క్రమశిక్షణ చర్యల్లో భా గంగా సోమవారం కానిస్టేబుల్‌ను సస్పెన్షన్ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. పూర్తిస్థా యి విచారణ కోసం టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖరరాజును ఏర్పాటు చేసినట్లు చెప్పా రు. కాగా విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్ వరప్రసాద్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చిన ఐదుగురిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో మహేశ్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి బైక్‌లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
రాజకీయ లబ్ధికోసమే బోర్డు ప్రకటన
ఆర్మూర్: ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి కోసమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డు ఏర్పాటుకు అనుకూలంగా ప్రకటన చేశారని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహ నాయుడు సోమవారం ఆరోపించారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలన్నారు. స్పైస్ బోర్డు నుంచి పసుపును వేరు చేయడానికి పార్లమెంట్‌లో చట్టం చేయాల్సి ఉంటుందనే విషయం ప్రధానికి తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలోనే పసుపు రైతులు గుర్తుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో బీజేపీ నాయకులే తెలుపాలని అన్నారు.